Odisha: పోలీసులు తీవ్రంగా వేధించారు.. అమ్మాయని చూడకుండా..!
- పోలీసులు వేధించిన విషయాన్ని బయటపెట్టిన ఓ బాధితురాలు
- భరత్ పూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలిపై పోలీసు సిబ్బంది అమానుష ప్రవర్తన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసులు తనను వేధించిన విషయాన్ని ఓ బాధితురాలు వెల్లడించింది. ఆ రాత్రి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలిపై పోలీసు సిబ్బంది చేసిన అమానుష ప్రవర్తన వింటే మీరు కూడా షాక్ అవుతారు. వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 15వ తేదీ రాత్రి రెస్టారెంట్‌ను మూసివేసి ఇంటికి వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు ఆమెను అడ్డుకుని దాడికి యత్నించారని తెలిపింది. దీంతో వారి నుంచి తప్పించుకుని భరత్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అక్కడ ఒక మహిళా పోలీసు మాత్రమే ఉంది. అయితే.. తన వెంట కొందరు వ్యక్తులు పడుతున్నారని.. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ తెలిపింది. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులను పంపాలని మహిళ పోలీసుతో బాధిత మహిళ చెప్పింది. ఈ క్రమంలో.. న్యాయం చేయాల్సింది పోయి, మహిళా పోలీసు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించింది. అంతేకాకుండా.. దుర్భాషలాడింది.
Read Also: Jammu Kashmir: బీఎస్‌ఎఫ్ బస్సు కాలువలో పడి ముగ్గురు జవాన్లు మృతి..
Also Read
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేందుకు బాధితురాలికి మరో అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో.. ఆమెను జైల్లో పెట్టి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. ఆ సమయంలో ఇద్దరు మహిళా పోలీసులు తన జట్టు పట్టుకుని కొట్టారని బాధిత మహిళ తెలిపింది. ఒక మహిళా పోలీసు తన గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిందని.. తనను తాను రక్షించుకోవడానికి ఆమె చేతిని కొరికినట్లు పేర్కొంది. అంతేకాకుండా.. మహిళా పోలీసులు తన చేతులను జాకెట్‌తో వెనుకకు కట్టేసి, కాళ్లకు దుపట్టాతో బంధించి గదిలో బంధించారని చెప్పింది. కొంత సమయం తరువాత.. ఒక మగ పోలీసు తనపై ఉన్న బట్టలు తీసివేసి, ఛాతీపై చాలాసార్లు తన్నాడని తెలిపింది. కొన్ని గంటల తర్వాత ఒక సీనియర్ అధికారి వచ్చి తన ప్యాంటు కిందకు లాగి అత్యాచారం చేస్తానని బెదిరించాడని బాధిత మహిళ వెల్లడించింది.
Read Also: Pune: చూస్తుండగానే రోడ్డు మధ్యలో దిగిపోయిన డ్రైనేజీ ట్యాంకర్.. వీడియో వైరల్
- Tags
- Atrocious
- harassment
- Odisha
- police
- Woman
తాజావార్తలు
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!