Tripura Crime: దారుణం.. కన్నతల్లిని చెట్టుకు కట్టేసి సజీవదహనం చేసిన కొడుకులు
- త్రిపురలో అమానుష ఘటన
- కన్నతల్లిని చెట్టుకు కట్టేసి సజీవదహనం చేసిన కొడుకులు
- ఇద్దరు కుమారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tripura Crime: త్రిపురలో అమానుష ఘటన వెలుగుచూసింది. నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కుమారులే కర్కశంగా సజీవదహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలచివేసింది. పశ్చిమ త్రిపురలోని చంపక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్‌బారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 62 ఏళ్ల వృద్ధ మహిళను ఆమె ఇద్దరు కుమారులు చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారని అధికారులు ఆదివారం వెల్లడించారు. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కొడుకులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు కుమారులను అదుపులోకి తీసుకున్నామని, కుటుంబ కలహాలే ఈ దారుణ హత్యకు దారితీసి ఉంటాయని అనుమానిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also:Hassan Nasrallah: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టిన పైలెట్ కు ఘన స్వాగతం!(వీడియో)
Also Read
- SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
ఆ మహిళ భర్త ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిసింది. భర్తను కోల్పోవడంతో ఆ మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తోంది. ఆమె మరో కుమారుడు అగర్తలాలో ఉండేవాడు. గతం కొంతకాలంగా ఇద్దరు కుమారులు తరచూ గొడవలకు దిగేవారని పోలీసుల విచారణలో తెలిసింది. శనివారం సాయంత్రం ఆమెకు, ఇద్దరు కుమారులకు వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో ఇద్దరు కలిసి మహిళను చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టారు. దీంతో మహిళ సజీవదహనమైంది. కాలిన మృతదేహాన్ని చూసి భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!