Pune murder: ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య.. ఏం కట్టుకథ అల్లిందంటే..!
- మహారాష్ట్రలోని పూణెలో దారుణం
- ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య
- పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. కలకాలం భాగస్వామికి తోడుగా ఉండాల్సిన అర్ధాంగినే అంతుచూసింది. ఆ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది.

Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
అమోల్ నివాంగునే(45) అనే వ్యక్తి పూణెలోని కార్వేనగర్‌లో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఇతనికి భార్య ఉమా నివాంగునే (42), ముగ్గరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఉమా నివాంగునే… ప్రసన్న కొకరే (27) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్యతో అక్రమ సంబంధం ఉందన్న కారణంతో ప్రసన్నను అమోల్ కొట్టాడు. ఒకవైపు ప్రియుడితో సుఖం లేదని.. ఇంకోవైపు భర్త.. ప్రియుడ్ని కొట్టాడన్న పగతో ఉమ, ప్రసన్న రగిలిపోతున్నారు. దీంతో అమోల్‌ను అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ స్కెచ్ వేశారు. శనివారం రాత్రి డ్యూటీ ముగించికుని అమోల్ ఇంటికి చేరుకుని పడుకున్నాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపు తట్టారు. అమోల్ తలుపు తెరిచి చూడగా బయట నిల్చున్న వారు పదునైన ఆయుధాలతో పొడిచి హత్య చేశారు. ప్రియుడు ప్రసన్న సాయంతోనే ఉమ ఈ ఘాతుకానికి పాల్పడింది.
ఇది కూడా చదవండి: Pantham Nanaji: రంగరాయ మెడికల్ కాలేజ్ వైస్ చైర్మన్ని దుర్భాషలాడిన ఎమ్మెల్యే నానాజీ..
అనంతరం ఉమ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దోపిడీ దొంగలు ఇంటిపై దాడి చేసి తన భర్తను చంపారని ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో పరిసరాలను పరిశీలించిన ఖాకీలకు అలాంటి పరిస్థితులు కనిపించలేదు. కానీ నగలు, నగదు మాత్రం మాయమయ్యాయి. దీంతో అనుమానంతో ఉమను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ప్రసన్నతో ఉమకు ఉన్న అక్రమ సంబంధం వెలుగు చూసింది. భర్తను వదిలించుకోవాలన్న ఆలోచనతోనే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఉమ, ప్రసన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. సింహగఢ్ రోడ్డులోని ఇంటి దగ్గర నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ప్రసన్నను పట్టుకున్నారు. ఉమతో ప్రసన్నకు అక్రమ సంబంధం ఉందని, కొద్ది రోజుల క్రితం అమోల్ ప్రసన్నను కొట్టాడని పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: PM Modi: అమెరికా చేరుకున్న మోడీ.. క్వాడ్ సమ్మిట్‌కు హాజరుకానున్న ప్రధాని
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!