Micro Finance: మైక్రో ఫైనాన్స్ ఆగడాలు.. మహిళను 8 గంటల పాటు వేధించిన సిబ్బంది
- మహిళను వేధింపులకు గురి చేసిన మైక్రో ఫైనాన్స్ అధికారులు
- ఫైనాన్స్ చెల్లించాలని 8 గంటలుగా ఇంట్లో కూర్చున్న ఫైనాన్స్ సిబ్బంది
- మహిళను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఫైనాన్స్ సిబ్బంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Micro Finance: మైక్రో ఫైనాన్స్ అధికారులు మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఫైనాన్స్ చెల్లించాలని 8 గంటలుగా ఫైనాన్స్ సిబ్బంది మహిళ ఇంట్లో కూర్చున్నారు. మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో కొంతకాలంగా మహిళలు మైక్రో ఫైనాన్సు సంబంధించిన కొన్ని ప్రైవేటు ఫైనాన్స్ ద్వారా అప్పులు తీసుకున్నారు. 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చొప్పున తీరుస్తున్నారు.
Read Also: Deputy CM Pawan Kalyan: కుమార్తె ఆధ్యతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్
Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
మంగళవారం రోజు కూడా ఆ మహిళల వాయిదా ఉండడంతో ఉదయం ఏడు గంటలకు మహిళ సంఘం లీడర్ ఇంటికి మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వచ్చారు. ఫ్యూజన్ ఫైనాన్స్ సిబ్బంది మహిళలు కట్టాల్సిన కిస్తీలను ఖచ్చితంగా చెల్లించాల్సిందే అని ఇంట్లో తిష్ట వేశారు. పండగ పూట డబ్బులు లేవని, పనులు లేక కుటుంబం గడవడమే కష్టంగా ఉందని ఇప్పుడు కట్టలేమని వచ్చే వాయిదలో చెల్లిస్తామని చెప్పినా ఇంట్లోనే కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వాల్టి వాయిదా చెల్లించాల్సిందేనని ఫైనాన్స్ సిబ్బంది తెగేసి చెప్పారు. ఉదయం 7 సెంటల నుండి దాదాపు సాయంత్రం నాలుగు గంటల వరకు మహిళలను మానసికంగా వేధింపులకు గురి చేశారు.
సమాచారం తెలుసుకున్న ఎల్డీఎం మల్లికార్జున్ అధికారి అక్కడికి చేరుకొని మహిళలతో ఫైనాన్స్ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఏ రూల్ ప్రకారంగా మీరు మహిళలకు రుణాలు ఇచ్చారని ఫైనాన్స్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఎవరైతే అప్పులు తీసుకుంటారో వారి ఇంటి వద్ద తిష్ట వేసుకొని కూర్చునే రూల్స్ మీకు లేదని, దాన్ని అతిక్రమిస్తే మాత్రం మీపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వెంటనే అక్కడినుండి మైక్రో ఫైనాన్స్ సిబ్బందిని తిరిగి పంపించేశారు.
తాజావార్తలు
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!