ఉత్తరప్రదేశ్‌లోని బందాలో దారుణం చోటు చేసుకుంది. మహిళ ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాలను కట్ చేసిన ఘటన సంచలనం రేపింది. ఆ మహిళ పదునైన వస్తువుతో అతని ప్రైవేట్ భాగాలను కత్తిరించింది. ఆ వ్యక్తి తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తనపై దాడికి యత్నించడంతో తాను ఈ దారుణానికి ఒడిగట్టానని మహిళ పేర్కొంది.
బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళపై తన స్నేహితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా.. తనకు మత్తు మందు ఇచ్చి.. అత్యాచారం చేసిన ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తుున్నాడని బాధితురాలు సోమవారం పోలీసులకు తెలిపింది.
కర్నూలు జిల్లాలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హోలగుంద మండలం హెబ్బటంలో తల్లి, బిడ్డను హత్య చేసింది భర్తే అని నిర్ధారణకు వచ్చారు స్థానిక పోలీసులు.. భార్య సలీమా(24) , కూతురు సమీరా(4) ను భర్త సక్రప్ప గొంతు నులిమి చంపినట్లుగా విచారణలో తేల్చారు పోలీసులు.. అయితే, బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందని భర్త సక్రప్ప మొదట ప్రచారం చేసిన విషయం విదితమే..
రాజధాని అమరావతి పునర్‌నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఇదే సమయంలో.. అమరావతి నిర్మాణానికి విరాళాలు కూడా స్వీకరిస్తున్నారు.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. కోటి విరాళంగా అందించారు.
ఎయిరిండియా మహిళా పైలట్ సృష్టి తులి మృతిపై మేనమామ వివేక్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సృష్టి తులి ఆత్మహత్య చేసుకోలేదని.. ఫ్రీ ప్లాన్డ్ మర్డర్ అని ఆరోపించారు
Terrible Inciden: సింగరేణిలో ఉద్యోగం అంటే ఆ దంపతులు నమ్మారు. ఉద్యోగం కోసం మరో మహిళకు రూ.16 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బులతో ఓ వ్యక్తిని నమ్మి తనతో పాటు వెళ్లిన మరో మహిళ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు.
ప్రస్తుతం ఎంతో మంది తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ఆరాటపడుతున్నారు. అందుకోసం ప్రమాదకర స్టంట్లు చేస్తూ.. లైకుల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఫాలోవర్స్ మోజులో కొందరు యువకులు డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారు.
పసికందును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని కోఠి ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును కిడ్నాప్ చేసేందుకు యత్నించిన మహిళను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
శిఖర్ ధావన్ మళ్లీ ఎవరితోనైనా ప్రేమలో పడ్డాడా..? ధావన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే.. వైరల్ అవుతున్న వీడియో చూస్తే అదే సందేహం కలుగుతుంది. శిఖర్ ధావన్ ఓ కొత్త అమ్మాయితో కనిపించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలియనప్పటికీ.. తనతో పాటు ఆమె విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.. ధావన్తో ఆమెకు ఉన్న అనుబంధం గురించి ఇంకా క్లారిటీ లేదు.
తిరుచానూరు శిల్పారామంలో ప్రమాదం జరిగింది. శిల్పారామం క్యాంటీన్ వద్ద గల ఫన్ రైడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. జెయింట్ వీల్లో తిరుగుతూ 20 అడుగుల ఎత్తు నుండి ఇద్దరు మహిళలు కింద పడిపోయారు. ఈ క్రమంలో.. ఓ మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.