వెనిజులాలో ఉన్న ఐదు మంచుపర్వతాలు ఇప్పటికే అదృశ్యమయ్యాయి. ఇప్పుడు చివరి హిమానీనదం కూడా కరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న హిమానీనదాల పరిమాణం ఎంత ఉందో ఇప్పటి వరకు తెలియదు. కానీ అవన్నీ కరిగిపోతే సముద్రం సమీపంలో ఉన్న నగరాలన్నీ మునిగిపోతాయి.
Weather : వాయువ్య భారతం విపరీతమైన వేడిని ఎదుర్కొంటోంది. చాలా ప్రాంతాల్లో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో అత్యధికంగా 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Delhi : దేశ రాజధాని ఢిల్లీని శనివారం రాత్రి భీకర తుపాను తాకింది. ఈ తుపాను ధాటికి పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. తుపాను సంబంధిత ఘటనల్లో 19 ఏళ్ల యువతితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 23 మంది గాయపడ్డారు.
ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వైపు ఎండలతో జనాలు ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు వానలు కాస్తా ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు ఎండలు, వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలతో ఉపశమనం లభించింది. ప్రధానంగా ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి.
తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న ఏపీ జనం ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో.. ప్రజలు వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొన్ని చోట్ల వాతావరణం చల్లబడగా.. మరికొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో.. నగరం అతలాకుతలం అయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మండే ఎండలతో వడగాలులకు వడదెబ్బ తాకి జన ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో జోరు వాన పడింది.
గత మంగళవారం కురిసిన భారీ వర్షానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అతలాకుతలం అయింది. ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింది. ఏడాదిన్నర వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసి దుబాయ్‌ను దడదడలాడించింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాబోవు మూడు రోజులకు సంబంధించిన వాతావరణ సూచనలను భారత వాతావరణ శాఖ తెలిపింది. ఒడిస్సా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు అంతర్గత రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది అని పేర్కొనింది.
Summer: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల తర్వాత రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వడగాలులు, వేడితీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.