Different Weather: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. ఉదయం ఎండ చంపుతుంటే, సాయంత్రం వర్షం పడుతుంది. ఆ వెంటనే విపరీతమైన చలి ఉంటుంది.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటి వరకూ ఎండ కొట్టినప్పటికీ, ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, కూకట్ పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. గత మూడు రోజులుగా రోజు సాయంత్రం కాగానే కుండపోత వాన పడుతుంది. కేవలం నగరంలోనే కాకుండా.. పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది.
వాతావరణం అన్నాక మార్పులు సహజం. కానీ అసహజ ధోరణులు పుట్టి ముంచుతున్నాయి. ఒక వైపు వరదలు.. మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు. టోటల్‌గా అసాధారణ వాతావరణం అందర్నీ వణికిస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లు అసాధారణ వర్షాలు.. వాన వెలిసిన వెంటనే మాడు పగిలేలా ఎండలు. ఏం వచ్చినా పట్టలేం అన్నట్టుగా ఉంది వాతావరణం పోకడ. ఈ మధ్య కాలంలో ఈ అపరిచిత ధోరణులు బాగా పెరిగాయి. ఎంత సాంకేతికత ఉన్నా.. వాతావరణాన్ని అంచనా వేయడం వీలుకావడం…
Red Alert: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జన జీవనంత అస్తవ్యస్తంగా మారింది.
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారత్‌లో అయితే అత్యంత భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒడిశాలో గత మూడు రోజులుగా వడదెబ్బ కారణంగా 20 మంది మరణించారు. ఒడిశా తీవ్రమైన వేడిగాలులతో అల్లాడుతున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
బెంగళూరులో నిన్న (శనివారం) భారీ వర్షం కురిసింది. రాబోయే ఐదు రోజుల పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో.. ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. నగరంలో అనేక ప్రదేశాలలో నీరు ఎక్కడికక్కడా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్ 2 (ఆదివారం) నుండి జూన్ 4 (మంగళవారం) వరకు బెంగళూరులో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.…
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుఫాన్గా మారింది. దానికి రేమాల్గా నామకరణం చేశారు. రేమాల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది.