ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాబోవు మూడు రోజులకు సంబంధించిన వాతావరణ సూచనలను భారత వాతావరణ శాఖ తెలిపింది. ఒడిస్సా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు అంతర్గత రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది అని పేర్కొనింది. అయితే, ఇవాళ యానాంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Read Also: Jogi Ramesh: చంద్రబాబు, పవన్ ఇద్దరు కలిసినా గెలవలేరు.. అందుకే బీజేపీతో దోస్తీ చేస్తున్నారు..
ఇక, రేపు- ఎల్లుండి ఆంధ ప్రదేశ్ రాష్ట్రంలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. అలాగే, ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకు వీచే ఛాన్స్ ఉందన్నారు. వేడి, తేమతో అసౌకర్యమైన వాతావరణం కూడా రాష్ట్రంలో అక్కడక్కడ ఏర్పడవచ్చును అని ప్రకటించింది. అయితే, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. అలాగే, రాయలసీమలో ఈరోజు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు.