తౌక్టే తుఫాన్ తో ఇప్పటికే కేరళ వణికిపోతుంది. తరుముకొస్తున్న ఈ తుఫాన్ ఆరు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడులో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అయితే తౌక్టే తుఫాను తెలంగాణా రాష్ట్రం నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణా రాష్ట్రంలో దక్షిణ దిశ నుండి వీస్తూన్నాయి. రాగల 3 రోజులు (18,19,20వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన…
తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అత్యంత తీవ్ర తుఫాను’ తౌక్టే’ ఇంకా కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. గడచిన 6 గంటలలో 15 km వేగంతో ప్రయాణిస్తూ, బలపడి ఈ రోజు ఉదయం 08:30 గంటలకు 18.8°N latitude మరియు 71.5°E longitude లలో, ముంబయికి పశ్చిమ దిశగా 150 km దూరంలో కేంద్రీకృతమై ఉందని కూడా తెలిపింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి, గుజరాత్ తీరంలోని పోర్బందర్ – మహువాల మధ్య ఈ…
తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా వింత వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ, సాయంత్రానికి చల్లబడి అక్కడక్కడా వర్షాలు పడటం జరుగుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే రానున్నట్లు ఇస్రో వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఇటు తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు…
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా, ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం వరకు మారిపోయింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయ్యాయి. వర్షం కురిసే ముందు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.
తెలంగాణకు మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి నుంచి ఉన్న ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం, ఈ రోజు ఇంటీరియర్ ఒడిస్సా నుండి విదర్భా, తెలంగాణ, రాయలసీమ మీదగా దక్షిణ తమళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9కిమి ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణా రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు మరియు ఈదురగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని..…
తెలంగాణకు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న జార్ఖండ్ నుండి ఛత్తీస్ ఘడ్, తెలంగాణాల మీదగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిమి ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు నైరుతి మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల నుండి మరత్వాడా మీదగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిమి ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని…