Dubai Floods: ఇంకా నీళ్లల్లోనే దుబాయ్.. స్తంభించిన జనజీవనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత మంగళవారం కురిసిన భారీ వర్షానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అతలాకుతలం అయింది. ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింది. ఏడాదిన్నర వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసి దుబాయ్‌ను దడదడలాడించింది. పలుచోట్ల రోడ్లు, ఇళ్లు ఏకమైపోయాయి. మరికొన్ని కోతకు గురయ్యాయి. భారీ నీటి ప్రవాహానికి కార్లు, బైకులు, వస్తువులు కొట్టుకుపోయాయి. దాదాపు నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడలేదు. ఓ వైపు అధికారులు.. సహాయ బృందాలు పని చేస్తున్నా.. వర్షపు నీరు ఇంకా రోడ్లు, ఇళ్ల మధ్య నిలిచిపోయి ఉన్నాయి. దీంతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు తీరక అల్లాడిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా వీడియోలు పెడుతున్నారు. అంటే వర్షం ఎంతగా కురిసిందో దీని బట్టి చెప్పొచ్చు.
Also Read

ఏప్రిల్ 15 సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. మొదట చినుకులతో నెమ్మదిగా ప్రారంభమై.. అనంతరం ఒక్కసారిగా తీవ్ర ప్రభావం చూపించింది. విపరీతంగా వర్షం కురిసింది. 1949 తర్వాత అంతటి వర్షం కురవడం మళ్లీ ఇదే కావడం విశేషం. ఇక వర్షపునీరు అపార్ట్‌మెంట్ల కింద నిలిచిపోవడంతో కార్లు వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితమైపోయారు. మరోవైపు వర్షపునీరు బయటకు పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పలు కార్యాలయాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి.
ఇది కూడా చదవండి: IPL 2024: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మహ్మద్ నబీ అసంతృప్తి.. పోస్ట్ వైరల్..!
ఇక భారీ వర్షానికి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వర్షపునీటితో నిండిపోయింది. దీంతో ఆయా దేశాలకు చెందిన విమాన సర్వీస్‌లన్నీ నిలిచిపోయాయి. మరోవైపు అధికారులు వేగంగా పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడలేదు. దీంతో చీకట్లోనే ప్రజలు మగ్గుతున్నారు. విద్యుత్ అధికారులు కూడా విద్యుత్ లైన్లను సరి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది సహజంగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కృత్రిమ వర్షాలతో పని ఉండదని సాధారణంగా వర్షాలు పడొచ్చని సూచించింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Rajnath Singh: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి ప్రభుత్వాలే.. ఖమ్మంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!