ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నల్లని మేఘాలతో హరిద్వార్ చీకటిగా మారిపోయింది. అయితే ఈ వాతావరణ పరిస్థితిని షెల్ఫ క్లౌడ్ అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. షెల్ఫ్ క్లౌడ్ అనేది లోతట్టు, క్షితిజ సమాంతర మేఘాల నిర్మామని వెదర్ డిపార్ట్మెంట్ నిపుణులు తెలిపారు. హరిద్వార్ లో కమ్ముకొచ్చిన మేఘాలను కొందరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతోన్నాయి.
దేశంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. రుతు పవనాలు ఆలస్యంగా రావడంతో ఈ ఏడాది జూన్‌లో వానలు కురవలేదు. దీంతో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జూన్‌లో 30 శాతం తగ్గిన వర్షపాతం తగ్గినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్‌తో సహా పలు రాష్ట్రాల్లోకి త్వరలో ప్రవేశించనున్నాయి.
తెలంగాణకు చల్లటి కబురు అందింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
క్లైమేట్ చేంజ్ అనలిస్ట్ అవ్వడం ఎలా?.. వాతావరణ పరిస్థితిని అంచనా వేయడం ఎలా..?. జూన్ నెలలో, నగరం లేదా గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా దేశంలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత కారణంగా ప్రతి ఒక్కరూ మండే వేడితో ఇబ్బంది పడుతున్నారు
మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో 38-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయని.. ఎండలు కొద్ది కొద్దిగా తగ్గుతాయనీ ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Cyclone Biparjoy: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుఫాను తీవ్ర తుపానుగా మారింది. గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్న ఈ తుఫాను గుజరాత్ లోని పోర్ బందర్ కు నైరుతి దిశగా 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. జూన్ 15న కచ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ క్రమంలో తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం…
AP Weather Report for Upcoming 3 Days: మన దేశంలో అత్యధిక వర్షపాతం అందించే నైరుతి రుతుపవనాలు ఈ సారి ఆలస్యం అయ్యాయి. ముందే రావాల్సి ఉన్నా కాస్త ఆలస్యంగా ఈ నెల 8న కేరళను తాకాయి. జూన్ 11న ఏపీ, తమిళనాడు వంటి ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఈ రుతుపవనాలు ప్రవేశించాయి. ఇక ఈ రుతుపవనాల గురించి అమరావతి వాతావరణ కేంద్రం సమాచారం ఇచ్చింది. ఆ సమాచారం మేరకు నైరుతి…
Weather Report: ఈ ఏడాది వాతావరణం నెలనెలా మారుతోంది. ఒక్కోసారి విపరీతమైన చలి, ఒక్కోసారి తీవ్రమైన వేడి, వర్షం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇదొక్కటే కాదు, వడగళ్ల వాన అనేక రాష్ట్రాల్లో రైతులను ఇబ్బందులకు గురి చేసింది.
Weather: తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ద్రోణి కారణంగా నగరంలో పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి.