వేసవికాలం తాపంతో ఉన్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఎండలు ఠారెత్తిస్తుంటే.. ఒక్కసారి వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. దీంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్‌లో కురిసింది. నగరంలోనే కాకుండా.. రాష్ట్రం వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఐఎండి అంచనా ప్రకారం దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో శనివారం (22-04-2023) ఉత్తరాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదివారం ఉత్తరాంధ్ర, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.
Also Read : Deepika Misra: శౌర్య పురస్కారం అందుకున్న మొదటి మహిళా ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్
ఇదిలా ఉంటే.. 15 రోజుల్లో పంట చేతికి వస్తుందనగా మండలంలో గురువా రం అర్ధరాత్రి భారీ గాలులతో కురిసిన అకాల వర్షా నికి వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. దేవుని గూడ, ఇందన్‌పల్లి, మురిమడుగు, కలమడుగు, కవ్వాల, చింతగూడ, తిమ్మాపూర్, ధర్మారం, కామన్ పల్లి, మొర్రిగూడ, తపాలపూర్ గ్రామాల్లో సుమారు 1102 ఎకరాల్లో 719 మంది రైతులు పంట నష్టపో యినట్లు వ్యవసాయాధికారుల లెక్కల చెబుతున్నా యి. శుక్రవారం ఉదయం అధికారులు గ్రామాల్లో పంట నష్టం అంచనా వేశారు.
Also Read : Off The Record: ఆ ఎమ్మెల్సీలు వేరేగా ఆలోచిస్తున్నారా?