తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు పొరుగు జిల్లాల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఊరుములు, మెరుపులు, వడగళ్ల వానలు పడ్డాయి. హైదరాబాద్, శివార్లలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పౌరులు నిద్రలేచారు. కుండపోత వర్షం వల్ల కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని రోడ్లపై నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం/ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండ వేడిమి నుంచి ప్రజలకు భారీ వర్షాలు ఉపశమనం కలిగించాయి.
Also Read : Viral Video: ప్లీజ్ మోడీ జీ.. దయచేసి మంచి స్కూల్‌ను నిర్మించండి.. చిన్నారి అభ్యర్థన
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గురువారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం రాత్రి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన.. వడగళ్ల వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోందని, పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 34 నుంచి 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read : Bhatti Vikramarka : ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. త్వరలో తిరుగుబాటు రానుంది