Virat Kohli Pub: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. బెంగళూరులోని ఎమ్జీ రోడ్డులో గల కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్ నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనకు పాల్పడినట్లు బెంగళూరు బృహత్ మహానగర పాలిక ఆఫీసర్లు గుర్తించడంతో నోటీసులు జారీ చేశారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్వభావం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. అతనిని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు. ఇక మైదానంలో ఎంత దూకుడుగా ప్రవర్తిస్తాడో చెప్పనవసరం లేదు. ప్రత్యర్థులు అతన్ని కవ్వించారంటే.. వారికి మూడినట్లే. తనదైన స్టైల్లో వారికి ఇచ్చిపడేస్తాడు. ఇక.. బయట మాత్రం ఎంతో ప్రశాంతంగా తన కుటుంబంతో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే.. తాజాగా ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ చేసిన పనికి విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు.
రవిచంద్రన్ అశ్విన్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. గబ్బా టెస్టు మ్యాచ్ తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ రిటైర్మెంట్ వార్త విన్న విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఇద్దరు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొన్నారు.. ఈ సమయంలో అశ్విన్ విరాట్‌తో ఏదో చెప్పాడు. ఆ తర్వాత కోహ్లీ అతన్ని కౌగిలించుకోవడం కనిపించింది. రీటైర్మెంట్ ప్రకటనకు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీకి…
AUS vs IND: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ‘ఫాలో ఆన్’ ప్రమాదం నుంచి బయటపడింది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్‌కు 39 పరుగుల కీలక భాగస్వామ్యం అందించడంతో టీమిండియా ‘ఫాలో ఆన్’ గండం నుండి బయట పడింది. వీరి మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ జట్టు ‘ఫాలో ఆన్’ ముప్పును తప్పించుకుంది. ఈ కారణంతో డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా కోచ్…
IND vs AUS: గబ్బా టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటను వర్షం కారణంగా ముందుగానే ముగించాల్సి వచ్చింది. KL రాహుల్, రవీంద్ర జడేజాల హాఫ్ సెంచరీల సహాయంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో క్రికెట్ టెస్టులో నాల్గవ రోజున భారత్ ఫాలో-ఆన్‌ను కాపాడుకుంది. నాల్గవ రోజు ముగియడంతో మ్యాచ్ డ్రాగా మారుతున్నట్లు కనిపిస్తోంది. జడేజా 123 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 77 పరుగులు చేశాడు. మరోవైపు కెఎల్ రాహుల్ 139 బంతుల్లో 84 పరుగులు…
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలిరోజు మాదిరిగానే మూడో రోజు కూడా వర్షం ప్రభావం చూపింది. కాగా.. ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. అందుకు బదులుగా బరిలోకి దిగిన టీమిండియా పేలవమైన ప్రదర్శన కనబరిచింది.
బ్రిస్బేన్‌లో పరుగుల వరద పారిస్తాడనుకున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశపరిచాడు. జోస్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో.. కోహ్లీని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియాపై మంచి రికార్డు కలిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈసారి మాత్రం నిరాశ పర్చుతున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు భారీ స్కోరు సాధించిన పిచ్‌పై సీనియర్ అయిన విరాట్.. తన బలహీనతతో ఔట్ కావడం అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని ఆడి మరీ వికెట్ కీపర్‌కు దొరికిపోయాడు. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇలా ఔట్ కావడం మూడోసారి. దీంతో కోహ్లీపై భారత…
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మరో మైలురాయి సాధించాడు. శుక్రవారం సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్‌లను బాబర్ ఆజం వెనక్కి నెట్టాడు. టీ20ల్లో వేగంగా 11000 T20 పరుగులు సాధించాడు. ఆజం.. 298 ఇన్నింగ్స్‌ల్లోనే 11000 పరుగుల మైలురాయిని సాధించాడు. బాబర్‌కు ముందు.. 314 ఇన్నింగ్స్‌లలో ఈ ఫార్మాట్లో వెస్టిండీస్ లెజెండ్ గేల్ అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు.…
మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికి వాతావరణం ఒక్కసారిగా మారింది. దీంతో ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు కాసేపు ఆపేశారు. వర్షం కారణంగా దాదాపు గంట ఆట తుడిచిపెట్టుకుపోయింది.