Happy Retirement: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పేలవ ఫాం కొనసాగిస్తున్నారు. మెల్ బోర్న్ టెస్టులో కూడా ఈ ప్లేయర్స్ బ్యాట్ నుంచి పరుగులు రాలేదు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ టెస్టు కెరీర్ చివరి దశకు వచ్చారు. ఇలాంటి పరిస్థితిలో.. ఈ పర్యటన వారికి చాలా ముఖ్యమైంది. అయితే, ఈ మంచి ఛాన్స్ ను ఉపయోగించుకోవడంలో రోహిత్, విరాట్ విఫలమయ్యారు. ఇక, మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 3 రన్స్ చేయగా.. రెండవ ఇన్నింగ్స్‌లో 9 పరుగులు మాత్రమే చేశాడు రోహిత్ శర్మ. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 36 రన్స్ చేయగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ పేలవమైన ప్రదర్శనతో రోహిత్, విరాట్లపై అభిమానులు మండిపడుతున్నారు.
ఇక, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో భారత క్రికెట్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఇద్దరికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుండటంతో.. #HappyRetirement అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇప్పటికే, ఈ ఇద్దరు ప్లేయర్స్ టెస్టు కెరీర్ ముగిసిపోయింది, భవిష్యత్తులో వీరు టెస్టులు ఆడే ఛాన్స్ లేదని పేర్కొంటున్నారు. కాగా, రోహిత్ శర్మకు ఈ సిరీస్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు అతను 3 మ్యాచ్‌లలో 5 ఇన్నింగ్స్‌లలో 6.20 సగటుతో కేవలం 31 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో 10 పరుగులే అతని బెస్ట్ స్కోరు అని చెప్పాలి. అలాగే, విరాట్ కోహ్లీ 4 మ్యాచ్‌లలోని 7 ఇన్నింగ్స్‌లలో 27.83 సగటుతో 167 రన్స్ చేయగా.. అందులో ఒక శతకం ఉంది.. ఈ సెంచరీ మినహా మొత్తం సిరీస్‌లో ఎలాంటి ప్రభావం చూపించలేదు విరాట్ కోహ్లీ.
Happy Retirement Rohit Sharma 🥺💔#INDvsAUS pic.twitter.com/PnzDLqxptH
— Dogesh (@dogesh_bhai) December 30, 2024
Elon Musk changed the Like Button for Virat Kohli & Rohit – The Goat l.
Happy Retirement Rohit and Kohli #INDvsAUS #AUSvINDIA #RohitSharma𓃵 #ViratKohli𓃵 #JaspritBumrah Sara #flightcrash Jaiswal #MannKiBaat Sunil Gavaskar #zelena pic.twitter.com/EQYA8LPrir
— Roshan meena (@1f8be1a6f3fe4ad) December 30, 2024
Happy Retirement Rohit and Kohli 💔
Go to London and Do your business 👋 pic.twitter.com/jwAg5QA1ti
— Preeti Yadav (@PreetiYadav_16) December 30, 2024
Time has come to say Happy Retirement to Rohit Sharma and Virat Kohli 🫡
Such a stupid stupid stupid batting by Rishabh Pant. Need to give chance to others.#INDvsAUSTest #AUSvINDIA #INDvAUS#RohitSharma𓃵 #ViratKohli𓃵 #chokli#RohitSharma #ViratKohli #retire#WTC2025 #BGT25 pic.twitter.com/ShdHDkznUM
— Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) December 30, 2024