IND vs AUS: మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఆరంభంలోనే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 రన్స్ భారీ లక్ష్యంతో ఐదో రోజు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భారత జట్టు కేవలం 33 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ సమయానికి భారత్ రోహిత్ శర్మ (9), కేఎల్ రాహుల్ (0), విరాట్ కోహ్లీ (5) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక, 17వ ఓవర్లలో పాట్ కమిన్స్ ఓవర్ తొలి బంతిని రోహిత్ శర్మను.. అదే ఓవర్లలోని చివరి బంతికి కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు.
Read Also: Punjab Bandh: రైతు నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష.. నేడు పంజాబ్ బంద్కు పిలుపు..
ఇక, మరో 8 పరుగులు జోడించాక విరాట్ కోహ్లీ కూడా పెవిలియన్ కు చేరాడు. అయితే, అంతకు ముందు ఐదో రోజు ఆట ప్రారంభించిన రెండో ఓవర్లో నాథన్ లియోన్ ను బూమ్రా బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా 234 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని భారత్‌కు 340 రన్స్ భారీ లక్ష్యాన్ని ఆసీస్ నిర్దేశించింది. కాగా, భారత జట్టు కోల్పోయిన మూడు వికెట్లలో రెండు కమిన్స్‌కు దక్కగా, ఒక వికెట్ మిచెల్ స్టార్క్ తీసుకున్నాడు.