Virat Kohli: మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా ఫెయిల్ కావడంతో ఆర్సీబీ మాజీ కోచ్, ఆసీస్ మాజీ ప్లేయర్ సైమన్ కటిచ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ది కింగ్ ఈజ్ డెడ్’ అని కామెంట్స్ చేశాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియా 184 రన్స్ భారీ తేడాతో ఓడిపోయింది. అత్యంత కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి డగౌట్ కి చేరాడు. పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో శతకం కొట్టిన కోహ్లీ ఆ తర్వాతి నుంచి పేలవమైన బ్యాటింగ్‌తో విమర్శలకు గురైతున్నాడు. పెర్తులో సెంచరీ తర్వాత వరుసగా 7, 11, 3, 36, 5 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక, విరాట్ కోహ్లీ ఫామ్‌పై సైమన్ కటిచ్ మాట్లాడుతూ.. ‘ది కింగ్ ఈజ్ డెడ్’ అంటూ విమర్శలు గుప్పించాడు. అతడు తబడుతున్నాడు.. ‘కింగ్’ను ఇప్పుడు బుమ్రా తీసేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విరాట్ చాలా నిరుత్సాహంగా కనిపిస్తున్నాడు.. అది అతడికి పెద్ద ఎదురుదెబ్బ అని పేర్కొన్నాడు. ఈ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే 12.83 సగటుతో 30 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటి వరకు 44 టెస్టులు ఆడి 203 వికెట్లను తన అకౌంట్లో వేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్ సిరీస్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది.. ఈ టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో ప్రారంభం అవుతుంది.