ఇటీవల భారత్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ ప్రపంచ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి.. నంబర్‌వన్ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం మిచెల్ ఖాతాలో 845 పాయింట్లు ఉన్నాయి. ఇంతకుముందు మొదటి స్థానంలో ఉన్న కింగ్ కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. వరుసగా రెండు సెంచరీలతో సిరీస్‌ను శాసించిన డారిల్…
ఇండోర్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఒక బ్రౌన్ కలర్ డ్రింక్ తాగడం, ఆ తర్వాత అతను ఇచ్చిన వింత ఎక్స్ప్రెషన్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా కోహ్లీ ముఖంలో కనిపించిన హావభావాలు ఈ ఆసక్తిని మరింత పెంచాయి. దీంతో ఆ డ్రింక్ ఏంటనే విషయంపై నెట్టింట ఆసక్తికర చర్చ మొదలైంది. ఆ వీడియోను…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త కేంద్ర కాంట్రాక్ట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనున్నది. దీని కింద గ్రేడ్ A ప్లస్ కేటగిరీ రద్దు చేయనున్నట్లు సమాచారం. BCCI వర్గాల సమాచారం ప్రకారం, బోర్డు ఈ కొత్త నమూనాను ఆమోదిస్తే, టీం ఇండియా దిగ్గజ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ ను తగ్గించే అవకాశం ఉంది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను గ్రేడ్ Bలో ఉంచొచ్చని తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కేంద్ర…
Gautam Gambhir and Virat Kohli Relationship: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మధ్య సంబంధాలు అంతగా లేవని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. విరాట్, గౌతమ్‌లు ఒకరితో ఒకరు మాట్లాడుకోరని కూడా న్యూస్ చక్కర్లు కొడుతుంటాయి. ఈ ఊహాగానాలకు భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ పులిస్టాప్ పెట్టారు. న్యూజిలాండ్‌తో జరిగే రెండవ వన్డేకు ముందు విరాట్-గంభీర్ మధ్య సంబంధం గురించి ఆయన కీలక సమాచారం…
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. రాజ్‌కోట్‌లో మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి వన్డేలో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైయిపు మొదటి వన్డేలో ఓడిన న్యూజిలాండ్.. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఓ రేర్ రికార్డు సాధించే…
Ind vs NZ 2nd ODI: భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ 2026లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తొలి వన్డేలో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా బుధవారం (జనవరి 14) రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగే రెండో వన్డేలో సిరీస్‌ను గెలుచుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ గాయంతో సిరీస్‌కు దూరం కావడం…
వన్డే క్రికెట్లో భారీ లక్ష్యాల్ని ఛేదించడంలో ‘కింగ్’ విరాట్ కోహ్లీకి ఎవరూ సాటిలేరని గణాంకాలు చెబుతున్నాయి. భారత్ 300 రన్స్ పైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన మ్యాచ్‌ల్లో కోహ్లీ చూపించిన స్థిరత్వం, క్లాస్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. 300+ రన్స్ లక్ష్యం ఉన్న విజయవంతమైన చేజ్‌లలో కోహ్లీ ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ 12 ఇన్నింగ్స్‌ల్లో 1091 పరుగులు చేశాడు. కేవలం పరుగులే కాదు.. సగటు కూడా అద్భుతంగా ఉంది. ఛేజింగ్ మ్యాచ్‌ల్లో…
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయంలో తన వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెప్పాడు. లక్ష్య ఛేదనలో పరుగులు చేయడమే కాదు, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే అత్యంత ముఖ్యమని అన్నాడు. గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు టెన్షన్‌కు పోకుండా.. ప్రస్తుతంపై పూర్తిగా దృష్టి పెడుతా అని గిల్ తెలిపాడు. ప్రస్తుతం గురించి ఆలోచించినపుడే విజయాల ఆనందాన్ని, అపజయాల నిరాశను సమతూకంగా ఎదుర్కొనగలమని గిల్ తెలిపాడు.…
Virat Kohli: వడోదర వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. 301 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ అద్భుత…
‘‘వేల సంఖ్యలో సూసైడ్ బాంబర్లు’’.. ఉగ్రవాది మసూద్ అజార్ వణికించే ప్రకటన.. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) అధిపతి మసూద్ అజార్‌కు సంబంధించిన ఒక ఆడియో రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. దీంట్లో అతను వణికించే ప్రకటన చేశాడు. తన వద్ద పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ బాంబర్లు’’ ఉన్నారని ప్రకటించారు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. మసూద్ అజార్ ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాది. భారత్‌పై దాడులు చేసేందుకు వీరంతా…