Rohit Sharma: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టులు ఆడుతుంది. మొదటి టెస్టులో గెలిచిన తర్వాత అడిలైడ్‌లో ఓడింది. అనంతరం బ్రిస్బేన్ టెస్టును డ్రాగా ముగించుకున్న టీమిండియా మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం 184 రన్స్ తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారీ లక్ష్యం ముందున్నా చివరి వరకు పోరాడాలని నిశ్చయించుకున్నాం.. కానీ, ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయామన్నారు. ఏదేమైనా ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా ఆడి.. మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని తెలిపాడు. ఈ ఓటమి చాలా బాధాకరంగా ఉంది. మానసికంగా వేధిస్తోందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ గెలిచేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.. కానీ మేము మాత్రం విజయానికి దారిని వెతకలేకపోయామని రోహిత్ శర్మ వెల్లడించారు.
Read Also: Ethiopia: ఇథియోపియాలో ఘోర ప్రమాదం.. 71మంది మృతి
అయితే, ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పోరాడిన తీరు అసాధారణం అని రోహిత్ శర్మ తెలిపారు. ముఖ్యంగా చివరి వికెట్‌కు అద్భుతం చేశారు. ఇక, ఆఖరి రోజు 340 పరుగుల లక్ష్యం ఛేదించడం అంత ఈజీ కాదని మాకు తెలుసు. అయినా, అందుకు పునాది వేసేందుకు బాగా శ్రమించాం.. కానీ ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తాము అనుకున్న టార్గెట్ చేరలేకపోయామని అతడు పేర్కొన్నాడు. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగిన నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నా.. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడన్నారు. ఇక, నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్ లో విజయవంతమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగే అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి.. రోజు రోజుకూ అతడు మరింత మెరుగుపడాలని రోహిత్ శర్మ తెలిపారు.