మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి స్టీవెన్ స్మిత్ 68 పరుగులతో, కెప్టెన్ పాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టులో శామ్ కాన్‌స్టాస్ 65 బంతుల్లో 60 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 121 బంతుల్లో 57 పరుగులు, మార్నస్ లాబుషాగ్నే 145 బంతుల్లో 72 పరుగులు చేశారు. అద్భుత ఫామ్ లో ఉన్న హెడ్ మాత్రం ఈ సారి డక్ అవుట్ గా వెనుతిరిగాడు. ఇక టీమిండియా బౌలింగ్ డిపాట్మెంట్ లో బుమ్రా తన హావ కొనసాగిస్తూ మూడు వికెట్లను తీసుకున్నాడు.
Also Read: Lasith Malinga As Singer: సంగీత ప్రపంచంలోకి అడుగెట్టిన లసిత్ మలింగ.. పాటతో అదరగొట్టాడుగా
ఇదిఇలా ఉండగా ఈ రోజు మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో బౌలర్లు, ఫీల్డర్లు, ప్రేక్షకులు దృష్టిని ఆకర్షించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో యువ ఆటగాడు జైస్వాల్ చేసిన తప్పిదంపై రోహిత్ శర్మ చాలా కోపంగా ప్రవర్తించాడు. రోహిత్ శర్మ జైస్వాల్‌పై చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అవడంతో, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టీవ్ స్మిత్ – మార్నస్ లాబుషాగ్నే ఆస్ట్రేలియా తరఫున బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ జైస్వాల్‌ను మిడ్-ఆఫ్‌లో ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించాడు. అయితే, ఈ సమయంలో జైస్వాల్ బంతి తన దగ్గరకి రాకముందే పైకి దూకాడు. దీనిని చూసిన రోహిత్ శర్మ, జైస్వాల్‌ను కోపంగా ‘ఏయ్ జస్సు.. నువ్వు ఏమైనా గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? బ్యాట్స్‌మన్ బాల్ కొట్టే వరకు జంప్ చేయకు’ అని అరిచాడు. ఈ కామెంట్ స్టంప్ మైక్‌లో రికార్డు అవ్వడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Stump Mic Gold ft. THE BEST, @ImRo45! 🎙️😂
The Indian skipper never fails to entertain when he’s near the mic! 😁#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW pic.twitter.com/1fnc6X054a
— Star Sports (@StarSportsIndia) December 26, 2024
మిడ్-ఆఫ్ ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లు సాధారణంగా తమ చేతులను మోకాళ్లపై ఉంచి కిందకి వంగి నిలబడతారు. ఇది బ్యాట్స్‌మన్ క్యాచ్ ఇచ్చే అవకాశాన్ని పెంచుతుంది. ఈ విధంగా ఫీల్డర్లు బంతిని సులభంగా పట్టుకోవచ్చు. అయితే, జైస్వాల్ రోహిత్ శర్మ సూచనల్ని పరిగణలోకి తీసుకోకుండానే కదలడం వల్ల కెప్టెన్ కోపం వచ్చింది. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియా బ్యాట్స్మెను కవ్వింపు చర్యకు పాల్పడడంతో మ్యాచ్ ఫీజ్ లో 20% ఫైన్ పడింది.