Gautam Gambhir: టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ సిరీస్ మినహా న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై, ఇప్పుడు ఆస్ట్రేలియాలో పరాభవాలతో భారత జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో టీమ్ ను గాడిన పెట్టేందుకు కోచ్ గంభీర్ కఠినంగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తుంది. జట్టు ప్రదర్శనను విశ్లేషించే క్రమంలో ప్లేయర్స్ తప్పులను ఎత్తి చూపించడానికి అతడు ఏమాత్రం వెనుకాడలేదంటా!. ఇక, ఆటగాళ్ల పేర్లు ప్రస్తావించనప్పటికీ.. కొందరు ఆటగాళ్లు పరిస్థితులకు తగినట్లు ఆడకుండా, సొంత ఆట ఆడుతున్నారని గంభీర్ మండిపడినట్లు తెలుస్తుంది. ఇకపై తాను చెప్పినట్లే ఆడాలని హుకూం జారీ చేశాడని సమాచారం.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
గత ఆరు నెలలుగా వారు కోరుకున్నట్లు ఆడనిచ్చాను.. కానీ, ఇకపై ఎలా ఆడాలన్నది తాను నిర్ణయిస్తానని టీమిండియా కోచ్ గంభీర్ చెప్పడంటా. తాను ముందే నిర్ణయించిన టీమ్ ప్రణాళిక ప్రకారం ఆడని ప్లేయర్స్ ను జట్టు నుంచి తప్పించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్‌తో సిరీస్ నుంచి బ్యాటర్లు ఎంత దారుణంగా ఆడుతున్నది అతడు ప్లేయర్లకు వివరించాడట. నాలుగో టెస్టు ఆఖరి రోజు దూరంగా వెళ్తున్న బంతిని విరాట్ కోహ్లీ ఆడటంతో పాటు హెడ్ బౌలింగ్‌లో అనవసర షాట్‌తో రిషభ్ పంత్ ఔట్ కావడం జట్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. పంత్ తొలి ఇన్నింగ్స్‌లోనూ అనవసర షాట్‌కే పెవిలియన్ కు చేరాడంతో పాటు ఫాం లేమితో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ లైన్‌కు విరుద్ధమైన షాట్‌తో డగౌట్ కు వెనుదిరిగాడు.
Read Also: BLN Reddy: ఫార్ములా-ఈ రేస్ కేసులో ఈడీ ముందుకు HMDA మాజీ చీఫ్ ఇంజనీర్
వీటితో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహార శైలిపైనా కూడా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. టీమ్ లో చాలా మంది ఆటగాళ్లకు, గంభీర్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం. రవిశాస్త్రి, ద్రవిడ్‌ల హయాంతో పోలిస్తే సమాచార మార్పిడి సరిగ్గా లేదంటా. సెలక్షన్‌కు సంబంధించి ప్లేయర్స్ తో వ్యక్తిగతంగా మాట్లాడేవాడినని టీమిండియా సారథి రోహిత్ శర్మ చెప్పేవాడు.. కానీ కోచ్‌గా గంభీర్ బాధ్యతలు తీసుకున్నాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందట. టీమ్ నుంచి తప్పించడంపై జూనియర్ ఆటగాళ్లకు రోహిత్ శర్మ ఎలాంటి వివరణ ఇవ్వడం లేదని తెలుస్తుంది. మరోవైపు గంభీర్ కొందరు ప్లేయర్స్ విశ్వాసాన్ని పొందలేకపోయాడని సమాచారం. ఈ నేపథ్యంలో గంభీర్ భవితవ్యం మీదా కూడా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఆసీస్ తో జరిగే చివరి టెస్టు ఆడాల్సి ఉంది.. దాని ఆధారంగా జట్టు ప్రదర్శన మెరుగు కాకపోతే గంభీర్ పదవి కూడా సురక్షితం కాదని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి చెప్పుకొచ్చాడు.