Happy Birthday Virat kohli: క్రికెట్ లో ఫార్మేట్ ఏదైనా సరే పరుగుల వరద సృష్టించే వ్యక్తి విరాట్ కోహ్లీ. టెస్టు, వన్డే, టి20 ఫార్మేట్ ఏదైనా సరే.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకొని ఎంతోమందిని అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. క్రికెట్ అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకున్న విరాట్ కోహ్లీ నేడు 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ ఏడాది టి20 ప్రపంచ కప్ టీమిండియా గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో…
Team India: న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సొంతగడ్డపై.. అదీ స్పిన్ పిచ్‌లపై టీమిండియా పూర్తిగా విఫలమవడం వల్ల కొంతమంది సీనియర్లకు సెగ తగిలేలా కనబడుతుంది.
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ ఆదివారం ముగిసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. భారత గడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. 12 ఏళ్ల తర్వాత టీమిండియా సొంత గడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసి భారత్‌కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో.. భారత జట్టు 29.1 ఓవర్లలో 121 పరుగులకు…
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను ఇప్పటికే భారత్ కోల్పోయింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ వైట్‌వాష్ కాకుండా చూసుకోవాల్సిన దానిపై టీమిండియాపై ఉంది.
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్లో చిరుతపులిలా పరుగెత్తడం చూస్తూ ఉంటాం. ఫీల్డింగ్ అయినా, వికెట్ల మధ్య అయినా వేగంగా పరుగులు తీస్తాడు. అయితే ఈరోజు చివరి టెస్టులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ జోరుకు బ్రేక్ పడినట్లుగా అనిపించింది. ఎందుకంటే.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే కోహ్లీ.. రనౌట్ అయ్యాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డైవింగ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు.
IND vs NZ 3rd Test Match: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో టీమిండియా మరోసారి తడబడుతోంది. తొలి రెండు టెస్టులలో ఓడిన టీమిండియా చివరి గేమ్‌లోనూ పేలవ ప్రదర్శన చేసేలా కనపడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌ను 235 పరుగులకే పరిమితం చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. దింతో ఇంకా 149…
నేడు (సెప్టెంబర్ 31) ఐపీఎల్ 2025 సంబంధించి అన్ని జట్లకు రిటెన్షన్ ప్లేయర్ల వివరాలు తెలిపేందుకు చివరి తేదీ. నేటి సాయంత్రం ఏఏ జట్టు ఏఏ ఆటగాళ్లను అంటిపెట్టుకొని ఉందన్న విషయం తెలిసిపోతుంది. ఇప్పటికే ఐపీఎల్ లోని వివిధ జట్లు ఏ ఆటగాళ్లను ఉంచుకోవాలో.. ఏ ఆటగాళ్లను వేళానికి వదిలేస్తుందన్న వివరాలు దాదాపు ఒక అంచనాకు వచ్చాయి. ఇది ఇలా ఉండగా.. వచ్చే ఏడాది మార్చి చివరివారం లేదా.. ఏప్రిల్ మొదటి వారంలో మొదలు కాబోయే ఐపీఎల్…
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబర్ 31 లోపు సమర్పించాల్సి ఉంది. తుది గడువుకు మరికొన్ని గంటలే ఉన్న నేపథ్యంలో అభిమానుల దృష్టి అంతా రిటెన్షన్ జాబితాపైనే ఉంది. ఏ ప్రాంచైజీ ఏయే ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటుంది, ఎవరిని వేలంలోకి వదిలేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తుది గడువు సమీపిస్తున్నా కొద్దీ.. స్టార్ ఆటగాళ్ల చుట్టూ పలు ఆసక్తికర కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి…