హీరోయిన్ అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. గత నెలలో ఈ జంట తమ అభిమానులతో ఈ శుభవార్త పంచుకున్నారు. త్వరలో తాము ముగ్గురము కాబోతున్నట్లు వారు ప్రకటించారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఈ జంట మీడియాకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా అతియా బేబీ బంప్‌తో ఉన్న కెమెరాలకు చిక్కింది.
Also Read: Shruti Haasan: అమ్మ నాన్న వల్లే మద్యానికి బానిసయ్యా.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్
వీడియోలో, అతియా బేబీ బంప్‌తో కనిపిస్తుండగా, ఆమె వెనుక అనుష్క శర్మ కూడా కనిపిస్తుంది. వీడియోలో చూసినట్లుగా.. అనుష్క శర్మ స్ట్రిప్ టాప్, డెనిమ్ లాంగ్ స్కర్ట్‌లో ఉండగా.. నావీ వైట్, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి ఉంది. కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన కేఎల్ రాహుల్, అతియా శెట్టి జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తమ మొదటి బిడ్డతో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇటీవల, ఈ జంట తమ అభిమానులతో ఈ అద్భుతమైన శుభవార్తను తెలిపారు.
Also Read: Digital Arrest Call: సైబర్ నేరస్తుడికి యువకుడు బలే దెబ్బేశాడుగా.. (వీడియో)
ప్రెగ్నెన్సీ కారణంగా, అతియా ప్రస్తుతం భర్త కేఎల్ రాహుల్‌తో గడుపుతున్నారు. రాహుల్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో జట్టుతో పాటు కొనసాగుతున్నాడు. దాంతో అతియా కూడా ఆస్ట్రేలియాలో ఉంది. ఆమె అనుష్క శర్మతో ఎక్కువ సమయం గడుపుతోందని అర్థమవుతుంది. ఇటీవల, వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు విరాట్ కోహ్లీ ఫ్యాన్ పేజీలో షేర్ అయ్యాయి.అతియా శెట్టి సినిమా కెరీర్ పూర్తిగా ఆపేసి తన వైవాహిక జీవితాన్ని కేఎల్ రాహుల్‌తో ఎంజాయ్ చేస్తోంది.