Bangladesh Player Accuses Virat Kohli Of "Fake" Fielding: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ రేసులో ముందుంది. బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. విజయం వైపు దూసుకెళ్తున్న బంగ్లాదేశ్ ను ఐదు పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ పరాజయాన్ని బంగ్లా ఫ్యాన్స్, క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ను ఓడించేందుకు వచ్చామని బీరాలు పలికిన బంగ్లా టీమ్ కు ఏడుపు…
Virat Kohli: టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు ఆదివారం నాడు పెర్త్‌లో బస చేసింది. అయితే అక్కడి హోటల్ గదిలో కోహ్లీ లేని సమయంలో ఓ వ్యక్తి వెళ్లి గదిలోని వస్తువులను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం కలకలం రేపింది. కోహ్లీ ధరించే దుస్తులు, కళ్లద్దాలు, టోపీలు, బూట్లు, ఇతర వస్తువులను ఈ వీడియోలో చూపించాడు. అయితే ఈ వీడియోపై స్పందించిన విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.…
టీ-20 వరల్డ్‌కప్ సూపర్-12 గ్రూప్‌లో పాక్‌పై భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన అనుభవాన్నంతా ప్రదర్శించడంతో టీమిండియా గెలుపు తీరాలకు చేరింది. కోహ్లీ ఆటతీరుకు ఎంతో మంది అభిమానులు మంత్రముగ్ధులయ్యారు.
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా చరిత్ర సృష్టించాడు. ఒక ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. సికిందర్ రజా ఈ ఏడాది ఏడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.…
ICC Rankings: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం చూపించిన టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకుల్లోనూ తన సత్తా చాటుకున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియా విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో లాంగ్ జంప్ వేసి టాప్-10లోకి ప్రవేశించాడు. ఆసియా కప్ ఆరంభానికి ముందు 35వ ర్యాంకులో ఉన్న విరాట్ కోహ్లీ ఆ టోర్నీతో ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో…