టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్తో సెమీ ఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియాను గాయాలు భయపెడుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్లో భారత కీలక ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు క్రికెట్ అభిమానులను కంగారుపెడుతున్నాయి.
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం తనదైన శైలిలో అద్భుత ఫామ్తో ముందుకు దూసుకుపోతున్నాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో ఆడిన ఐదు మ్యాచ్లలో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. కెరీర్లో ఎన్నో రికార్డులకు రారాజుగా మారిన అతడు తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. గత ఏడాది జనవరిలో ఐసీసీ ఈ అవార్డును ప్రవేశపెట్టగా తొలిసారి కోహ్లీ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. మొత్తం ముగ్గురు…
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సచిన్, ధోనీ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ కోహ్లీ మాత్రమే. గతంలో పరుగుల వరద పారించిన కోహ్లీ మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు. అయితే ఇటీవల ఆసియా కప్ సందర్భంగా తిరిగి ఫామ్లోకి వచ్చిన అతడు టీ20 ప్రపంచకప్లో మరోసారి రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచకప్లో నాలుగు…
Bangladesh Player Accuses Virat Kohli Of "Fake" Fielding: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ రేసులో ముందుంది. బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. విజయం వైపు దూసుకెళ్తున్న బంగ్లాదేశ్ ను ఐదు పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ పరాజయాన్ని బంగ్లా ఫ్యాన్స్, క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ను ఓడించేందుకు వచ్చామని బీరాలు పలికిన బంగ్లా టీమ్ కు ఏడుపు…
Virat Kohli: టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు ఆదివారం నాడు పెర్త్లో బస చేసింది. అయితే అక్కడి హోటల్ గదిలో కోహ్లీ లేని సమయంలో ఓ వ్యక్తి వెళ్లి గదిలోని వస్తువులను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం కలకలం రేపింది. కోహ్లీ ధరించే దుస్తులు, కళ్లద్దాలు, టోపీలు, బూట్లు, ఇతర వస్తువులను ఈ వీడియోలో చూపించాడు. అయితే ఈ వీడియోపై స్పందించిన విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.…