Virat Kohli Creates Sensational Record in ODI History: రికార్డుల రారాజు, రన్ మెషీన్ అయిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. తాజాగా తన ఖాతాలో మరో అరుదైన ఘనతను వేసుకున్నాడు. ఇంతవరకూ ఏ ఒక్క భారతీయుడికి సాధ్యం కాని రికార్డ్‌ని నమోదు చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో తాను చేసిన సెంచరీతో.. ఆ రికార్డ్ అతని సొంతం అయ్యింది. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటి? అని అనుకుంటున్నారా! వన్డే ఛేజింగ్‌లో విరాట్‌కి మొత్తం 37 సెంచరీలు ఉండగా.. ఆ 37 సార్లు టీమిండియా గెలిచింది. దీంతో.. దీంతో వన్డే చరిత్రలో 37 విన్నింగ్ నాక్స్ ఆడిన తొలి ఆటగాడిగా కోహ్లీ సంచలన రికార్డ్ సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఆయన తన సుదీర్ఘమైన కెరీర్‌లో 33 సార్లు విన్నింగ్ నాక్స్ ఆడాడు. ఇప్పుడు కోహ్లీ 4 నాక్స్ ఎక్కువగా ఆడి, ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగాడు.
Viral : త్రీడీతో బురిడీ కొట్టిస్తున్న మేకప్ ఆర్టిస్ట్
కాగా.. మొన్న బార్సపారా స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ తాండవం చేసిన సంగతి తెలిసిందే. ఓపెనర్లిద్దరూ అద్భుతమైన ఆరంభాన్ని అందించాక బరిలోకి దిగిన కోహ్లీ.. టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత తన బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ని నిదానంగా మొదలెట్టిన ఈ స్టార్ ఆటగాడు.. ఆ తర్వాత క్రమంగా పరుగుల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. ఇక చివర్లో ఒక్కసారిగా విజృంభించాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఫలితంగా.. 87 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్స్ సహకారంతో 113 పరుగులు చేశాడు. 49వ ఓవర్‌లో ఒక భారీ షాట్ ఆడబోయి.. క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇతనితోపాటు రోహిత్ శర్మ (83), శుబ్మన్ గిల్ (70) కూడా మెరవడంతో.. ఈ మ్యాచ్‌లో భారత్ 373 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. ఒక దశవరకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది కానీ, ఫైనల్‌గా భారత బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసింది. దీంతో ఈ మ్యాచ్‌ని 67 పరుగుల తేడాతో భారత్ కైవసం చేసుకుంది.
Hyper Aadi: నా కన్నతల్లిపై ఒట్టు.. పవన్ లాంటి నేతను చూడలేరు..