Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్య.. ఆ రికార్డ్ సాధించిన తొలి ఇండియన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Creates Sensational Record in ICC Rankings: టీ20 ఫార్మాట్‌లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎలా దూసుకెళ్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఒక అర్థశతకం, ఒక శతకంతో చెలరేగిపోయాడు. ఈ నేపథ్యంలోనే అతడు చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున ఏ ఒక్కరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నట్టు తేలింది. దీంతో.. పొట్టి ఫార్మాట్‌లో అతని అగ్రస్థానం మరింత పదిలం అవ్వడమే కాదు, 900 లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ పాయింట్స్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్రపుటలకెక్కాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 45 బంతుల్లో సెంచరీ చేయడం వల్లే.. అతడు 900 రేటింగ్ పాయింట్స్ మార్క్‌ని అందుకోగలిగాడు.
Suicide Attack: కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 20 మందికి పైగా మృతి!
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
ఇంతకుముందు టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో కేవలం ఇద్దరు మాత్రమే 900 రేటింగ్ పాయింట్స్ మార్క్‌ని చేరుకోగలిగారు. ఇప్పుడు లేటెస్ట్‌గా సూర్యకుమార్ 900 మార్క్‌ని అందుకొని, వారి సరసన చేరాడు. తాజా ర్యాంకింగ్స్‌లో సూర్య తర్వాత పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ అల్లంత దూరాన ఉన్నాడు. 836 రేటింగ్ పాయింట్లతో అతడు రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మలాన్, గ్లెన్ ఫిలిప్స్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్ వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. అయితే.. టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ జాబితాలో 631 రేటింగ్ పాయింట్స్‌తో 13వ స్థానంలో ఉన్నాడు. కాగా.. ఇప్పటివరకూ 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 46.41 సగటున 180.34 స్ట్రయిక్ రేట్‌తో 1578 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Vishnu Vardhan Reddy: ఏపీని మూడు ముక్కల్లా చేసేటట్టున్నారు.. జగన్ అజెండా ఏంటి?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు