Virat Kohli: వన్డే కెరీర్‌లో కోహ్లీ 45వ సెంచరీ పూర్తి.. సచిన్ రికార్డు సమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీని ఫుల్ ఫాంలో చూడటం కంటే మెరుగైన దృశ్యం ఏదైనా ఉందా? గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలోని అభిమానులు భారత మాజీ కెప్టెన్‌ను కింగ్ అంటూ అరుపులతో తమ అభిమానాన్ని చాటారు. మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కోహ్లి 80 బంతుల్లోనే 45వ వన్డే శతకాన్ని సాధించాడు. మూడు ఫార్మాట్లలో ఇది కింగ్ కోహ్లీకి 73వ అంతర్జాతీయ సెంచరీ. టెస్టుల్లో 27, టీ20ల్లో ఒక సెంచరీ సాధించాడు. అస్సాం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో శతకాన్ని సాధించగలిగాడు.
ఈ టోర్నీతో విరాట్ కోహ్లీ స్వదేశంలో 20 వన్డే సెంచరీలు సాధించాడు. కోహ్లీ స్వదేశంలో 20 సెంచరీలు చేసిన బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఈ ఫీట్‌ను సాధించాడు. తన 73వ అంతర్జాతీయ శతకాన్ని సాధించిన కోహ్లి 257 ఇన్నింగ్స్‌లలో 12500 వన్డేల్లో వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెండూల్కర్‌ను అధిగమించి కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. తన 45వ వన్డే సెంచరీతో కోహ్లి ఇప్పుడు శ్రీలంకపై తొమ్మిది సెంచరీలు చేశాడు. ద్వీపవాసులపై భారత బ్యాటర్ చేసిన అత్యధిక శతకాలు ఇవే కావడం గమనార్హం. తొలి వన్డేకు ముందు కోహ్లీ, టెండూల్కర్‌లు ఈ రికార్డును సంయుక్తంగా కలిగి ఉన్నారు. టెండూల్కర్, కోహ్లీ కూడా ఆస్ట్రేలియాపై వెస్టిండీస్‌లపై వరుసగా తొమ్మిది సెంచరీలు సాధించారు.
Also Read
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
SA T20 League: నేటి నుంచి సఫారీ లీగ్.. ఐపీఎల్ తరహాలో ఆదరణ ఉండేనా?
శ్రీలంకపై తొలివన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) భారత్‌కు శుభారంభం అందించగా, 20వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి శతక్కొట్టాడు. విరాట్ శ్రీలంక కెప్టెన్ దసున్ షనక వేసిన 22వ ఓవర్‌లో తన మొదటి బౌండరీని కొట్టాడు. అక్కడి నుంచి కోహ్లీకి రెండు అవకాశాలు లభించాయి. కోహ్లీ 47 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత, 37వ ఓవర్‌లో కసున్ రజిత బౌలింగ్‌లో వికెట్ కీపర్ కుసాల్ మెండిస్ క్యాచ్ డ్రాప్ చేశాడు. మళ్లీ 43వ ఓవర్‌లో రజిత బౌలింగ్‌లో లంక ఆటగాళ్లు మరోసారి కోహ్లీ క్యాచ్‌ను డ్రాప్ చేశారు. ఈసారి అతను 81 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షనక కోహ్లీ క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. 87 బంతులు ఆడి 113 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మెండిస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు
ఇదిలా ఉండగా శ్రీలంక ఎదుట భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 373 పరుగులు చేసింది. శ్రీలంక 374 పరుగులు చేయాల్సి ఉంది. మంచి ఊపుమీదున్న భారత్‌పై గెలవడం శ్రీలంకకు కష్టమని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?