Ind vs SL : కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా.. తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs SL : గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో.. బౌలింగ్‌లో ఉమ్రానా మాలిక్ విరుచుకుపడటంతో భారత్ శ్రీలంకను ఓటమిలోకి నెట్టేయగలిగింది. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక చేసిన పోరాటం వృథా అయింది. దీంతో సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 373 పరుగులు చేసింది. శ్రీలంకకు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. శ్రీలంకపై తొలివన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) భారత్‌కు శుభారంభం అందించగా, 20వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి శతక్కొట్టాడు.
ఛేజింగ్‌లో శ్రీలంక బ్యాటర్లు దసున్ షనక(108), పథౌమ్ నిస్సాంక (72), ధనంజయ డి సిల్వా (47) మంచి ప్రతిభ కనబరిచినా ఓటమిని తప్పించుకోలేకపోయారు. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ ఉమ్రాన్ మాలిక్ 57 పరుగులు ఇచ్చి 3 వికెట్లతో శ్రీలంకపై తన బుల్లెట్ల లాంటి బంతులతో విరుచుకుపడ్డాడు. సిరాజ్ రెండు, షమీ, హార్దిక్, చాహల్ తలా వికెట్ సాధించారు.
Also Read
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
Ind vs SL 1st Odi: తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్.. శ్రీలంక లక్ష్యం 374 పరుగులు
టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లి(113) అద్భుతమైన శతకాన్ని సాధించగా.. రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జనవరి 12న జరగనుంది.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!