Umran Malik: శ్రీలంకతో జరిగిన తొలివన్డేలో టీమిండియా యువ పేసర్, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. తాను వేసిన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 14వ ఓవర్) నాలుగో బంతిని ఏకంగా 156 కిమీ వేగంతో విసిరాడు. శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో రైట్ ఆర్మ్ పేసర్ స్పీడ్ రాడార్‌పై గంటకు 155 కి.మీ వేగంతో జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమించిన ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్ అయ్యాడు. ఈ పేసర్ బుమ్రా 153.36 కి.మీ.ల రికార్డును అధిగమించి అత్యంత వేగవంతమైన భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
భారత జట్టులో చోటు దక్కించుకున్నప్పటి నుంచి నిలకడైన వేగంతో బంతులు సంధిస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్‌లో కూడా టీమిండియా అత్యంత వేగవంతమైన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్ 157 కిమీ వేగంతో బంతిని విసిరాడు. భారత్ తరఫున ఐపీఎల్‌లో ఉమ్రాన్‌దే రికార్డు కావడం గమనార్హం. గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో.. బౌలింగ్‌లో ఉమ్రానా మాలిక్ విరుచుకుపడటంతో భారత్ శ్రీలంకను ఓటమిలోకి నెట్టేయగలిగింది. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక చేసిన పోరాటం వృథా అయింది. దీంతో సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 373 పరుగులు చేసింది. శ్రీలంకకు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. శ్రీలంకపై తొలివన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) భారత్‌కు శుభారంభం అందించగా, 20వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి శతక్కొట్టాడు.
Ind vs SL : కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా.. తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం
ఛేజింగ్‌లో శ్రీలంక బ్యాటర్లు దసున్ షనక(108), పథౌమ్ నిస్సాంక (72), ధనంజయ డి సిల్వా (47) మంచి ప్రతిభ కనబరిచినా ఓటమిని తప్పించుకోలేకపోయారు. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ ఉమ్రాన్ మాలిక్ 57 పరుగులు ఇచ్చి 3 వికెట్లతో శ్రీలంకపై తన బుల్లెట్ల లాంటి బంతులతో విరుచుకుపడ్డాడు. సిరాజ్ రెండు, షమీ, హార్దిక్, చాహల్ తలా వికెట్ సాధించారు.