సమంత అతి త్వరలో ఖతీజాగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతి, నయనతారతో కలసి సమంత నటించిన కోలీవుడ్ మల్టీ స్టారర్ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా నుంచి సమంత ఖతీజా లుక్ విడుదల అయింది. చిత్ర నిర్మాతలు ఈ చిత్రం నుండి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు. ఇందులో విజయ్ రాంబోగా కనిపించనున్నాడు. రంజన్ కుడి అన్బరసు మురుగేశ భూపతి ఓహూందిరన్ పేరునే షార్ట్ కట్ లో రాంబోగా మార్చారు.…
సినిమాపై కొందరు బెదిరింపు రాజకీయాలు చేయాలనీ చూస్తున్నారా ? అంటే… కోలీవుడ్ లో తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది. చిన్న చిన్న కారణాలతో సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం, నటులను కొడితే రివార్డులు అంటూ బహిరంగ ప్రకటనలు చేయడం, దాడులు చేస్తామంటూ బెదిరించడం ఆందోళనకరంగా మారింది. సినిమాను సినిమాలాగే చూడకుండా ఇందులో కూడా రాజకీయాలు చేస్తున్న కొందరు వ్యక్తులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడడం, ప్రభుత్వాలు ఈ తతంగాన్ని అంతా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం దారుణం.…
కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి, ఆయన బృందం బెంగళూరు విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన్నడానికి ప్రయత్నించిన వీడియో ఈ వారంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సేతుపతి సమస్యను చిన్న గొడవగా కొట్టిపారేయగా, హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. హిందూ మక్కల్ కట్చి సంస్థ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా…
ఇటీవల కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాగిన మైకంలో ఒక వ్యక్తి విజయ్ సేతుపతి పీఏపై దాడి చేశాడు. అనంతరం అతడే క్షమించమని అడగడంతో ఈ గొడవ ముగిసింది. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేయవద్దని సేతుపతి చెప్పడం చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా విదితమే. ఇక తాజగా ఈ ఘటనపై విజయ్ సేతుపతి స్పందించారు. “అది ఒక చిన్న ఘటన.. ఎయిర్ పోర్ట్ లో…
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతికి బెంగుళూరు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ నుంచి తిరిగి వస్తున్న ఆయనపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ దాడి ఆయనపై కాకుండా ఆయన పీఏపై జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో మద్యం మత్తులో ఒక వ్యక్తి.. విజయ్ పీఏతో గొడవకు దిగగా వారు వారించారని,…
సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రంలో కమల్ హాసన్తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ఇద్దరూ విలన్గా కనిపిస్తారని అంటున్నారు. Read Also : నాగశౌర్య ఫామ్ హౌజ్ లో జూదం… రిమాండ్ కు తరలింపు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా లొకేషన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మేకర్స్. ‘విక్రమ్’ చిత్రానికి…
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ “విక్రమ్”. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై . ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై అన్ని వర్గాల అభిమానులను ఆకర్షించింది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ క్రిష్ గంగాధరన్ ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు నటులు విజయ్ సేతుపతి,…
సౌత్ హిట్ సినిమాలతో పాటుగా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు కూడా బాలీవుడ్ లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.. కాగా, తాజాగా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘96’ చిత్రం కూడా బాలీవుడ్ లోకి రీమేక్ కాబోతుంది. విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత అజయ్ కపూర్ హిందీలో నిర్మించనున్నారు. ఈ విషయాన్ని అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్…
విడుదల: సెప్టెంబర్ 10 సన్ టీవీ, సెప్టెంబర్ 11 నెట్ ఫ్లిక్స్నిడివి: 146 మినిట్స్నటీనటులు: విజయ్ సేతుపతి, పార్థిబన్, సత్యరాజ్, పెరుమాళ్, రాశీఖన్నా, మంజిమా మోహన్,కరుణాకర్నిర్మాత: యస్.యస్. లలిత్ కుమార్కెమెరా: మనోజ్ పరమహంస, మహేంద్రన్ జయరాజుసంగీతం: గోవింద్ వసంతదర్శకత్వం: ఢిల్లీ ప్రసాద్ దీనదయాళన్ కోరోనా ఎఫెక్టెడ్ సినిమాలలో విజయ్ సేతుపతి నటించిన ‘తుగ్లక్ దర్బార్’ కూడా ఒకటి. విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ ’96’ సినిమాను పంపిణీ చేసిన లలిత్ కుమార్ ఆ సినిమా సక్సెస్…
అభిమానులు ప్రేమగా ‘మక్కల్ సెల్వన్’ అని పిలుచుకునే తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి గతంలోనే తెలుగులో ‘సైరా’లో ఓ ప్రత్యేక పాత్రలో మెరిశాడు. ఈ యేడాది వచ్చిన ‘ఉప్పెన’లో ప్రతినాయకుడిగా నటించి, మెప్పించాడు. తాజాగా విజయ్ సేతుపతి నటించిన ‘లాభం’ తమిళ చిత్రం, తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయ్యి ఒకేసారి విడుదలైంది. శ్రుతిహాసన్ కీలక పాత్ర పోషించిన ‘లాభం’ ఎలా ఉందో తెలుసుకుందాం. దేశ దిమ్మరి మాదిరి ఊర్లు పట్టి తిరిగిన బద్రి (విజయ్ సేతుపతి)…