కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల అతనిపై మైసూర్ విమానాశ్రయం లో ఒక వ్యక్తి దాడికి పాల్పడగా .. విజయ్ మేనేజర్ అతడిపై దాడికి దిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే . ఈ విషయమై విజయ్ సేతుపతి పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకుండా అది చిన్న గొడవ అని, అతడు తాగిన మైకంలో మాట్లాడాడని, ఈ ఘటనను హైలెట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఈ ఘటనలో బాధితుడు.. మేనేజర్ చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి అందరికి ట్విస్ట్ ఇచ్చాడు. విజయ్ సేతుపతిపై పరువు నష్టం దావా వేసినట్లు పేర్కొన్నాడు.
తమిళనాడు లోని చెన్నై కి చెందిన మహా గాంధీ ఆరోజు జరిగిన ఘటనను వివరిస్తూ” నేను ఆరోజు ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతిని ప్రశంసించాను. మీ నటన బావుంటుందని, మీరంటే చాల ఇష్టమని చెప్పాను. కానీ, వారు మాత్రం నా మాటలు పట్టించుకోకుండా వెళ్లిపోయారు.. అంతేకాకుండా నాపై దాడికి పాల్పడ్డారు .. విజయ్ మేనేజర్ నన్ను తీవ్రంగా కొట్టాడు.. ఆ దాడిలో నాకు తీవ్ర గాయాలు అయ్యాయి.. నా చెవి పని చేయడం లేదు.. దీనికి ఆయన మూల్యం చెల్లించాలి.. అందుకే ఆయనపై పరువు నష్టం దావా వేశానని” చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వారు ఈ విషయాలన్నీ దాచేసి ఏవేవో కట్టుకథలు అల్లినట్లు తెలిపాడు. మరి ఈ ఘటనపై విజయ్ సేతుపతి ఎలా స్పందిస్తాడో చూడాలి.