ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ తమ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే ఈ ఐదుగురు నటీనటులు ‘పుష్ప’లో నటించే ఆఫర్ ను వదులుకున్నారట.
Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు
దర్శకుడు సుకుమార్ పుష్ప స్క్రిప్ట్‌ను అల్లు అర్జున్ కంటే ముందు మహేష్ బాబుకు వివరించాడు. అయితే, మహేష్ మేకోవర్ చేయించుకోవడానికి, స్క్రీన్‌పై నెగెటివ్ క్యారెక్టర్‌ని చూపించడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. ఇక ‘ఊ అంటావా’ పాటకు దిశా ఫస్ట్ ఛాయిస్ అని చెబుతున్నారు. ఆమెను ఆన్‌బోర్డ్‌లోకి తీసుకురావడానికి మేకర్స్ ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పలు కారణాలతో ఆమె ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం.
మొదట శ్రీవల్లి పాత్రను సమంతకు ఆఫర్ చేశారు. అయితే, తెలియని కారణాలతో ఆమె ఆఫర్‌ను తిరస్కరించింది. చివరికి ఆ పాత్ర రష్మిక కిట్టిలోకి వెళ్లింది. సమంతను ‘ఊ అంటావా’ సాంగ్ కోసం ఒప్పించడానికి మేకర్స్ చాలా ప్రయత్నాలు చేసారు. బాలీవుడ్ బ్యూటీ నోరాను ‘ఊ అంటావా’ పాట కోసం మేకర్స్ సంప్రదించారు. అయితే ఇందులో భాగం కావడానికి నోరా భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినందున ఆమెను పక్కకు పెట్టారట. ఫహద్ ఫాసిల్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రను విజయ్ సేతుపతికి మొదట ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే డేట్స్ సమస్యల కారణంగా విజయ్ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు.