నయనతార, విజయ్ సేతుపతి, సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘కాతు వాకుల రెండు కాదల్’. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రం సమంత పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 28న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.
Read Also : Vishal : యాక్షన్ సీక్వెన్స్ లో తీవ్ర గాయం… షూటింగ్ వాయిదా
టీజర్ లో రాంబో (విజయ్ సేతుపతి) ఖతీజా (సమంత రూత్ ప్రభు), కన్మణి (నయనతార) ముగ్గురి లవ్ స్టోరీ ఆసక్తికరంగా ఉంది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఇద్దరు అమ్మాయిలనూ లవ్ చేస్తాడు. అయితే ఇద్దరిలో ఒక్కరినే అతను ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి విజయ్ సేతుపతి ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి. కామెడీతో కవ్విస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. మరి సమ్మర్ కానుకగా రానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు అలరిస్తుందో చూడాలి.