Shahrukh Khan : ఈ ఏడాది మొదట్లో షారూఖ్ ఖాన్ 'పఠాన్' ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో తన తదుపరి చిత్రం 'జవాన్'ని ప్రస్తుత ఏడాది మధ్యలో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు.
Vijay Stupathi: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఉన్నవారందరూ తమలోని ప్రతిభను అందరు గుర్తించాలని కోరుకుంటారు. ఒక లాంటి పాత్రలకే అంకితమవ్వకుండా అన్ని పాత్రలు చేసి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు. అలాంటివారు ఒక దగ్గరే ఆగిపోరు. వారికి ఆడంబరాలు అవసరం లేదు.
సందీప్ కిషన్ నటించిన 'మైఖేల్' పాన్ ఇండియా మూవీగా ఫిబ్రవరి 3న విడుదల కాబోతోంది. కంటెంట్, మేకింగ్ పరంగా దీనికి యూనివర్సల్ రీచ్ ఉందని సందీప్ కిషన్ చెబుతున్నాడు.
యువహీరోల్లో విజయం కోసం అలుపెరుగకుండా పోరాడుతూనే ముందుకు సాగుతున్నాడు సందీప్ కిషన్. నిజానికి ఇతగాడికి లెక్కకు మించి ఛాన్స్ లు లభించాయనే చెప్పాలి. అయినా ఎందుకో ఏమో ఘన విజయం ఇంకా ఊరిస్తూనే ఉంది.
Sundeep Kishan : సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఇప్పటివరకు వార్త ప్రచారంలో ఉంది. కానీ సందీప్ కిషన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వారి మధ్య ప్రేమ ప్రచారానికి బలాన్ని చేకూర్చుతోంది.
2007లో హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి తనదంటూ ఓ ముద్ర వేసుకుని అభిమానుల మదిని గెలుచుకున్నాడు కార్తీ. 2022 లో తమిళంలో వరుసగా 3 హిట్స్ కొట్టాడు. తాజాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న సినిమా పూజతో మొదలైంది.
లోకనాయకుడు అని అభిమానులు గౌరవంగా పిలుచుకునే కమల్ హాసన్ 'విక్రమ్' మూవీతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్లయిమాక్స్ లో మెరుపులా మెరిసి, మూవీని మరో స్థాయికి తీసుకెళ్ళాడు.