టాలివుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.. ఫ్యామిలీ కథా చిత్రాలకు పెట్టింది పేరు శర్వానంద్.. ఇప్పటికే శర్వానంద్ వరుసగా సినిమాలు చేస్తూ ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకుంటున్నారు.. ఇప్పపోతే ప్రస్తుతం ఈయన శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.. ఈ సినిమా మొత్తం ఫ్యామిలి డ్రామాగా ఉండబోతుందని టాక్..
కాగా, ఈ సినిమాలో శర్వానంద్ కు ఫాదర్ క్యారక్టర్ కీలకం అని చెబుతున్నారు.. ఆ పాత్రలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన విజయ్ సేతుపతి నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలుగులో ఉప్పెన లాంటి సినిమాలో కృతి శెట్టికి ఫాదర్ గా నటించాడు.. ఆ సినిమాలో తన పాత్రకు ప్రాణం పోసాడు.. దాంతో ఈ సినిమాలో ఫాదర్ క్యారక్టర్ హైలెట్ కానుంది.. శర్వాకు ఫాధర్ గా విజయ్ సేతుపతి నటించనున్నారు.. విజయ్ విలక్షణ నటుడుగా మంచి పేరు రావడం తో దాన్ని కాపాడుకుంటూ తెలుగులో కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాడు.
ఏ పాత్ర లో అయిన నటించి మెప్పిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్టైల్ ని ఏర్పాటు చేసుకొని వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు.. ఈ క్రమంలో చేసిన వరుస సినిమాలు మంచి సక్సెస్ లు ఉన్న అందుకుంటున్నాయని చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తెలుగు, తమిళంలో ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే.. విజయ్ సేతుపతి ఇండియాలోనే ది బెస్ట్ ఆర్టిస్టులలో ఒకడు. ఈయన చేసిన డిఫరెంట్ క్యారెక్టర్ల వల్ల ఆయనకి ఆ ఇమేజ్ అనేది దక్కింది… తెలుగులో వరుస సినిమాలలో నటిస్తున్నాడు..