విలక్షణ నటుడు విజయ్ సేతుపతి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకాలం హీరో, విలన్‌గా ఆడియన్స్‌ని అలరిస్తోన్న ఆయన కొంతకాలం పాటు కొన్ని పాత్రలకు బ్రేక్ ఇస్తానంటున్నారు. వాటి వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోందని, అందుకే ఈ ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ఓ ఈవెంట్‌లో స్పష్టం చేశాడు. కాగా తమిళ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఆయన కొంతకాలంగా విలన్‌గాను మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
Also Read: Actor Indrans: 65 ఏళ్ల వయసులో పదోతరగతి పరీక్షలకు సిద్దమవుతున్న స్టార్ నటుడు
ఇవి మాత్రమే కాదు నటుడిగా తనకు మెప్పే ఏ పాత్ర అయినా చేయడానికి వెనకాడడు. పాత్ర ఏదైనా తన నటనతో హీరోలను సైతం డామినేట్ చేస్తాడు. అందుకే విజయ్ క్రేజ్ సౌత్ నుంచి బాలీవుడ్ వరకు వెళ్లింది. భాషతో, ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని లాంగ్వేజస్‌లో నటిస్తున్న విజయ్ సేతుపతి కొన్నేళ్లు విలన్ పాత్రలకు దూరంగా ఉంటానని చెప్పాడు. ఇటీవల గోవాలో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న విజయ్ సేతుపతి.. విలన్ పాత్రల వల్ల ఒత్తిడి పెరుగుతోందని చెప్పాడు.
Also Read: Manchu Lakshmi: ముంబైకి మకాం.. ఎందుకో చెప్పిన మంచు లక్ష్మి
విలన్ రోల్స్ కోసం దర్శక-నిర్మాతలే కాదు స్వయంగా హీరోలే వచ్చి అడుగుతున్నారని, కాదనలేకపోతున్నానన్నాడు. అదే సమయంలో తనకు కొన్ని పరిమితులు పెడుతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘విలన్ పాత్రలు చేయడంలో తనకేమి చెడుగా అనిపించలేడం లేదు. నా పాత్రకు నేను వందశాతం న్యాయం చేయాలని నటిస్తాను. అదే సమయంలో నాకంటూ పరిమితులు ఉంటున్నాయి. హీరోని మించి చేయొద్దంటున్నారు. ఈ విషయంలో నన్ను చాలా కంట్రోల్ చేస్తున్నారు. దానివల్ల నాకు ఒత్తిడి పెరుగుతోంది. అందుకే కొన్నేళ్లు పాటు నెగిటివ్ పాత్రలు చేయొద్దని నిర్ణయించుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.