‘మొంథా’ తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో తుపాను ప్రభావం మొదలైంది. రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ కలెక్టర్లతో సహా స్పెషల్ ఆఫీసర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టిపెట్టాలని చెప్పారు. Also Read: Gold Rate Today: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో…
Minister Vangalapudi Anitha: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు సహాయక చర్యలపై రాష్ట్ర హోంమంత్రి అనిత ఎన్టీవీతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గత నాలుగు రోజులుగా తుపాను ముప్పుపై అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు. తుపాను ఈ నెల 28న అర్ధరాత్రి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని హోంమంత్రి వెల్లడించారు. దీని ప్రభావంతో రేపటి (27వ తేదీ) నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని,…
కందుకూరులో లక్ష్మీ నాయుడి హత్య బాధాకరం అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో లక్ష్మీ నాయుడు కుటుంబాన్ని పరామర్శించాం అని తెలిపారు. ఆర్థిక లావాదేవీల వల్లే లక్ష్మీ నాయుడి హత్య జరిగిందని, నిందితుడికి బెయిల్ రాకుండా శిక్షపడేలా చేస్తాం అని చెప్పారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పులేదు అని, తనకు వచ్చిన సమాచారాన్ని పవన్ వెల్లడించడంలో తప్పేముంది అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. డిప్యూటీ…
బాధిత మహిళకు, అతని తల్లిదండ్రులకు న్యాయం జరగాలని సూచించారు. హత్య జరిగిన నాటి నుంచి ప్రభుత్వం ఫాలో చేస్తుంది.. హత్యకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది.. నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇది ఒక భార్యాబిడ్డల ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన అని మంత్రి అనిత తెలిపింది.
రాజకీయం ఎలా చేయాలో కూడా తెలియని వ్యక్తి జగన్ అని వంగలపూడి అనిత పేర్కొనింది. విలువులతో కూడిన రాజకీయాలు చేయ్.. మేము కూడా స్వాగతిస్తామన్నారు. పోలీస్ ఉద్యోగాలు తీయడానికి ఆయన ఎవరు.. నిత్యం ఖాకీ చొక్కా వేసుకుని వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు.. గత ఐదేళ్లు పోలీస్ శాఖతో ఊడిగం చేయించుకున్నాడు.. ప్రతి పనికి పోలీసులను వాడుకున్నాడు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మానసిక పరిస్థితిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జగన్ జైల్ యాత్రలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కష్టపడి దేశాలు పట్టుకు తిరుగుతుంటే.. జగన్ బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తిని జగన్ పరామర్శించడం జుగుస్పాకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి మాటలని జగన్ సమర్ధిస్తూన్నారా?…
Vangalapudi Anitha vs YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. అధికార దుర్వినియోగం చేసి జగన్ అతని గొయ్యి అతనే తవ్వుకున్నారన్నారు. ఎవరిని టచ్ చేయకూడదో జగన్ వాళ్లనే టచ్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ఎంపీ రఘురామకృష్ణరాజును క్రూరంగా హింసించారని మంత్రి విమర్శించారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఉప్పుటేరు వంతెన…