Minister Anitha: మత్స్యకారులతో రాజకీయాలు చేయొద్దు..
- బల్క్ డ్రగ్‌పార్క్ విషయంలో మత్స్యకారుల ఆందోళనపై స్పందించిన హోంమంత్రి అనిత..
- బయట వ్యక్తులు వచ్చి మత్స్యకారులను రెచ్చగొట్టారు.. మత్స్యకారులతో రాజకీయాలు చేయొద్దు..
- సమస్య పరిష్కారం కోసం రాజయ్యపేట రావాలని మత్స్యకారులు కోరారు..
- హెటిరో కంపెనీతో రాజయ్య పేట గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు: హోంమంత్రి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anitha: ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు అనకాపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్య పేట గ్రామస్తులు హోంమంత్రి అనిత కాన్వాయ్ ను అడ్డుకుని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ పై రాజయ్యపేట ప్రజలను బయట వ్యక్తులు వచ్చి రెచ్చగొట్టారు అని ఆరోపించింది. మత్స్యకారులతో దయచేసి రాజకీయాలు చేయవద్దు అని కోరింది. పోలీసులు ఎవ్వరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను.. 16 రోజులుగా రాజయ్య పేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ మీద ధర్నా జరుగుతోంది.. సమస్య పరిష్కారం కోసం రాజయ్య పేట రావాలని ప్రజలు కోరారు.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఇక్కడకు వచ్చాను.. రాజయ్య పేట గ్రామం టీడీపీ కంచుకోట.. 2014, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీటీ ఇచ్చారు అని మంత్రి అనిత గుర్తు చేశారు.
Read Also: YouTube Premium Lite: ఇకపై యాడ్స్ కు బైబై.. YouTube Premium Lite భారత్ లో ప్రారంభం.. తక్కువ ధరకే
Also Read
అయితే, 2024 ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు అని హోంమంత్రి అనిత తెలిపింది. అప్పటి వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేశారు.. ఎన్డీయే ప్రభుత్వంలో మోడీ విశాఖలో మరల శంకుస్థాపన చేశారు.. హెటిరో కంపెనీ వలన రాజయ్య పేట గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు.. రాజయ్య పేట గ్రామస్తులు అన్ని పార్టీలు నాయకులు, ప్రజలతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పాను.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తాను.. రాజయ్య పేట ప్రజల కోరిక మేరకు బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించింది.
తాజావార్తలు
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!