ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ హీరో నాని తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.. ఏపీ మంత్రులు.. హీరో నానిపై కౌంటర్ ఎటాక్ చేస్తుంటే.. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాత్రం ఆయనకు బాసటగా నిలిచారు.. టిక్కెట్ ధరలపై హీరో నాని కామెంట్లపై స్పందించిన అనిత… హీరో నానికి థాంక్స్ చెబుతున్నాను.. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని వ్యాఖ్యానించారు.. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదన్న అనిత.. ఈ…
చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ.. నిన్న విశాఖపట్నంలోని నర్సీపట్నం టీడీపీ నేత అయ్యపాత్రుడు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ధర్నా కాస్తా పోలీసుల ఎంట్రీతో రసభాసగా సాగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, చింతలపూడి విజయ్ సహా 16 మందిపై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.…
రాబోయే కాలంలో హీరోలే గెలుస్తారు గానీ, విలన్లు గెలిచే పరిస్థితి లేదు. మిగిలిన రెండున్నరేళ్లు జగన్ ప్రభుత్వానికి గడ్డుకాలమే అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. 2019 డిసెంబర్ లో మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రంలో అల్లకల్లోలానికి నాంది పలికాడు. వేలాది మంది రైతులను, వారి కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేశారు. కోర్టులు మొట్టికాయలు వేస్తాయనే నిన్న ఉన్నపళంగా మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకున్నారు. సీఎం జగనుకు నిజంగా…
కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని పరిశీలనకు వెళ్తున్న టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం దౌర్భాగ్యం అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మైనింగ్ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన నాయకులను ఎనిమిది మందిని అరెస్టు చేశారు. తేదేపా పార్టీ ఆఫీస్ కి వెళుతుండగా దౌర్జన్యంగా అరెస్టు చేసి మంగళగిరి నుంచి కొల్లిపర తీసుకు రావడంలో అర్థం ఏంటి. మైనింగ్ లో తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది. తప్పు చేస్తున్నారు కాబట్టి…