Minister Anitha: కృష్ణా జిల్లాలో పర్యటించిన హోం మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేసింది. కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని జగన్ చూస్తున్నారు అని ఆరోపించింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పర్యటనలను అడ్డుకున్నది మీరు కదా?.. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు.
ఒకడు నరికేస్తాం అంటాడు. ఇంకొకడు కోసేస్తాం అంటాడు.. ఇవన్నీ మాట్లాడితే తప్పేంటి అని జగన్ అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత. ఎక్కడ యాక్సిడెంట్ అయిన ఎవరైనా ఏదో ఒక సహాయం చేస్తారు.. స్వయంగా సీఎం చంద్రబాబు దిగి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు.. కానీ, జగన్ కు మానవత్వం లేదనే సంగతి క్లియర్ గా అర్ధం అవుతోందన్నారు..
Vangalapudi Anitha: అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేసింది. కాడెడ్లతో నాగలి పట్టుకొని మంత్రి అనిత పొలం దున్నింది.
RK Roja: ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్న పరిస్థితిని ఆమె ఆవేదనతో వివరించారు. హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరుపై మండిపడుతూ.. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పుడు మహిళలకు రక్షణే లేదు. హోంమంత్రి అనిత మహిళలను కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి హోంమంత్రి పదవి ఆమె ఎందుకు చేపట్టారు..? మహిళలపై…
Vangalapudi Anitha: అమరావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇటీవల వైస్సార్సీపీ నాయకుల మాటలు రాష్ట్ర గౌరవాన్ని భంగపరచేలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అమరావతిని కించపరిచేలా పదాలను ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరకరం చేసారు. అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి అక్కసు.. మూడు రాజధానులు పేరుతో విషం కక్కారని హోం మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన మొదటి నుంచీ అమరావతిని నిర్లక్ష్యం చేయడమే లక్ష్యంగా తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. Read Also:…
అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. విజయనగరం కలెక్టరేట్‌లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరైన ఆమె.. డీఆర్సీలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏదో కాకి లెక్కలతో కాగితాల దొంతులుగా ప్రెస్‌నోట్ మా కిచ్చి వెళ్లిపోతున్నారని ఫైర్ అయ్యారు.. కానీ, ఆ పేపర్లు తర్వాత చెత్త బుట్టలోకి వెళ్లిపోతున్నాయి.. అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు..
అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి మే 2న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని సభ జరిగే ప్రాంతాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించగా.. తాజాగా హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని రాక సందర్భంగా 6 వేల మందితో…
Home Minister Anitha: వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పు చేసిన వారికి శిక్షపడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం వెళ్తోందన్నారు.
నేను చంద్రబాబుకి ఏక లవ్య శిష్యురాలిని అంటూ హోంమంత్రి అనిత తెలిపింది. ఆయనను చూసి నేను నేర్చుకున్నాను.. రాబోయే తరానికి కూడా ఆయన స్ఫూర్తిదాయకం.. ఆంధ్రప్రదేశ్ ను 2047కు అగ్రగామిగా ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. బంగారు కుటుంబంతో ప్రజలతో ఎంతో మంచి చేస్తున్నారు.
సచివాలయంలో అగ్ని ప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కొద్దిసేపట్లో ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి పరిశీలన చేస్తారన్నారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నామని, ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది అని హోంమంత్రి చెప్పారు. ఈ రోజు ఉదయం ఏపీ సచివాలయం రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీ రూమ్ పూర్తి స్థాయిలో కాలిపోయింది. ఆ బ్లాక్లో ఇంకా పొగ, బ్యాటరీ వాసన ఎక్కువగా ఉంది.…