Illicit affairs: వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు హత్యలకు కారణం అవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక చోట భర్తను హత్య చేస్తే, మరో సంఘటనలో భార్య హత్యకు గురైంది.
Halal: హలాల్ ట్యాగ్ కలిగిన ఉత్పత్తులను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నిషేధించింది. ప్రజారోగ్యం దృష్ట్యా హలాల్ సర్టిఫైడ్ వస్తువుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలను తక్షణమే నిషేధిస్తున్నట్లు తన యూపీ ఫుడ్ కమిషనర్ కార్యాలయం ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది. ఆహార ఉత్పత్తుల హలాల్ ధృవీకరణ అనేది ఒక సమాంతర వ్యవస్థ, ఇది ఆహార పదార్థాల నాణ్యతకు సంబంధించిన గందరగోళాన్ని సృష్టిస్తుందని, ఇది చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఆమోదయోగ్యం కాదని ఆర్డర్…
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో క్రిమినల్ రషీద్ కాలియాను హతమార్చారు. ఓ కాంట్రాక్టర్ ను చంపేందుకు వచ్చిన సమయంలో యూపీ ఎస్టీఎఫ్ బలగాలు దాడి చేశారు. ఘటనా స్థలంలో అతని వద్ద నుంచి రెండు పిస్టల్స్, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రగాయాలైన రషీద్ కాలియాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
Mohammed Shami:వరల్డ్ కప్ టోర్నీలో స్టార్ బౌలర్ మహ్మద్ షమీ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే టోర్నీలో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్నారు. టోర్నమెంట్లో ఆరు మ్యాచులు ఆడిన షమీ ఏకంగా 23 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 7 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రస్తుతం షమీ వరల్డ్ కప్ తో భీకరమైన ఫామ్ లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తప్పుకోవడంతో షమీకి ఛాన్స్…
Jaya Prada: సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదకు ఉత్తర్ ప్రదేశ్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు మాజీ ఎంపీ జయప్రదపై యూపీ జిల్లాలోని కోర్టు శుక్రవారం నాన్-బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది.
Lizard in Samosa: ఇటీవల కాలంలో బయటి ఆహారంతో జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పుడ్ ఫాయిజనింగ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో చికెన్ షవర్మా వల్ల ఒకరిద్దరి ప్రాణాలు పోయాయి. రెస్టారెంట్ల, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై అధికారుల నిఘా లేకపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచుతోంది. ఆహారంలో బల్లులు, కీలకాలు, ఎలుకలు రావడం పరిపాటిగా మారింది. సామాన్య జనాల ప్రాణాలతో ఫుడ్ మాఫియా ఆటలాడుకుంటోంది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రోజు ఓ వ్యాపారి ఇంటిని దోచుకోవడానికి వచ్చిన దొంగలు అతని భార్యను కట్టేసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడటమే కాకుండా సిగరెట్లతో దారుణంగా హింసించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. ఉత్తరప్రదేశ్‌లో ఆరేళ్ల చిన్నారిపై ఓ కుక్కల గుంపు మూకుమ్మడిగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద నెలకొంది. రాష్ట్రంలో బరేలీలోని షేర్ఘర్ పట్టణంలోని 5వ వార్డులో చేదలాల్ తన భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. వారికి 6 ఏళ్ల కుమారుడు దక్షు ఉన్నాడు. బుధవారం బాలుడు పిల్లలతో కలిసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపంలోని పొలంలో ఆడుకోవడానికి వెళ్లాడు. అక్కడ…
Fire Accident: ఇటీవల కాలంలో భారతీయ రైల్వేలో ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రైలు బోగీలు మంటల్లో చిక్కుకోవడం చూస్తు్న్నాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఇటావాలో ఈ రోజు న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లోని ఒక బోగీలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళ్తున్నప్పుడు స్లీపర్ కోచ్ లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించి అప్రమత్తం చేశారు.