A Young Man Carries Cobra to the hospital in UP: డాక్టర్ ఇదే నాగుపాము నన్ను కాటేసింది.. త్వరగా ఇంజెక్షన్ చేయండి అంటూ ఓ యువకుడు ఆసుపత్రికి వచ్చాడు. దాదాపు 4-5 అడుగుల నాగుపామును చూసిన డాక్టర్లు, అక్కడున్న పేషేంట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొందరు అయితే భయంతో ఆసుపత్రి బయటకు పరుగులు తీశారు. డాక్టర్ చివరకు యాంటీవీనమ్ ఇంజెక్షన్‌ను యువకుడికి ఇచ్చాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో సోమవారం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం… మీర్జాపుర్ లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతుల్ఖీ గ్రామంలో సూరజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం నాగుపాము అతడిని కాటు వేసింది. సూరజ్ ఏమాత్రం భయపడకుండా.. తనను కాటువేసిన పామును పట్టుకున్నాడు. ఆపై దానిని సంచిలో బంధించాడు. చికిత్స కోసం మీర్జాపుర్ ప్రభుత్వ ఆసుపత్రికి బైక్‌పై వెళ్లాడు. ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి.. తాను నాగుపాము కాటుకు గురయ్యానని, ఇంజెక్షన్ ఇవ్వాలని వైద్యులను కోరాడు.
Also Read: IND vs AUS: డేవిడ్ వార్నర్‌కు విశ్రాంతి.. భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే!
సూరజ్ తన వెంట తెచ్చిన నాగుపామును సంచిలో నుంచి తీసి.. ఎమర్జెన్సీ వార్డు బెడ్‌పై ఉంచాడు. దాంతో డాక్టర్లు, అక్కడున్న పేషేంట్స్ షాక్‌కు గురయ్యారు. కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత సూరజ్ నాగుపామును సంచిలో బంధించాడు. అనంతరం సూరజ్‌కు డాక్టర్ యాంటీవీనమ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం నాగుపాముకు సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.