Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లోని ఓ కాలేజీలో ముస్లిం విద్యార్థినులు తలపెట్టిన ఫ్యాషన్ షో వివాదాస్పదం అవుతోంది. ఈ షోపై జమియత్-ఏ-ఉలేమా అనే ముస్లిం సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం దీనిపై బీజేపీ స్పందించింది. ముస్లిం సంస్థ తీరును తప్పుపట్టింది.
మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ప్లే చేసే విషయంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు మరోసారి రంగంలోకి దిగారు. ఇవాళ ఉదయం స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు లక్నో, కాన్పూర్ సహా రాష్ట్రవ్యాప్తంగా లౌడ్ స్పీకర్లను తొలగిస్తున్నారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ ప్రాంతంలో దారుణం జరిగింది. 12 తరగతి చదువుతున్న విద్యార్థిపై కొందరు యువకుల గుంపు దాడి చేసింది, అంతటితో ఆగకుండా అతనిపై మూత్రవిసర్జన చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో వైరల్‌గా మారాయి. డార్క్ గ్రే కలర్ జాకెట్ ధరించిన వ్యక్తి బాధిత యువకుడిని కొట్టి, అతనిపై మూత్ర విసర్జన చేయడం వీడియోలో కనిపిస్తోంది. మరో ఇద్దరు ఈ ఉదంతాన్ని వీడియో తీశారు. దాడి ఆపాలని…
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదని మహిళను ఓ వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. కాన్పూర్‌లోని రాణా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. 26 ఏళ్ల వ్యక్తి తన పొరుగును ఉండే మహిళను నరికి చంపి, ఆ తర్వాత విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
Man Kills Wife: ఫ్రైడ్ చికెన్ కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఫ్రైడ్ చికెన్ కొనడానికి నగదు ఇవ్వలేదని ఆరోపిస్తూ ఓ టైలర్ తన భార్యను కత్తెరతో గొంతుకోసి హత్య చేశాడు. ఘజియాబాద్ లోని ప్రేమ్ నగర్ కాలనీలో శనివారం ఈ హత్య జరిగింది. షాహిద్ హుస్సేనే అతని భార్య నూర్ బానో(46)ని హత్య చేశాడని ఏసీపీ సిద్ధార్థ గౌతమ్ తెలిపారు. దంపతుల పిల్లల ముందే…
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మహ్మద్ ప్రవక్తను అవమానించడనే ఆరోపణలో ఓ వ్యక్తి బస్సు కండక్టర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో పొడిచాడు. ప్రస్తుతం కండక్టర్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. 20 ఏళ్ల యువకుడికి, కండక్టర్‌కి బస్సు టికెట్ ఛార్జీపై వివాదం మొదలైంది. ఆ తర్వాత అతనిని పొడిచాడు. ప్రవక్త గురించి అవమానకరంగా మాట్లాడినందుకే కండక్టర్‌పై దాడి చేసినట్లు నిందితుడు ఓ వీడియోలో…
No Non-veg Day: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రేపు అన్ని మాంసం దుకాణాలు బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘నో నాన్ వెజ్’గా ప్రకటించింది. సాధు టిఎల్ వాస్వానీ జయంతిని పురస్కరించుకుని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 25ని "నో నాన్ వెజ్ డే"గా ప్రకటించింది. మాంసం దుకాణాలు, కబేళాలను మూసేయాలని అధికార ప్రకటన తెలిపింది.
A Young Man Carries Cobra to the hospital in UP: డాక్టర్ ఇదే నాగుపాము నన్ను కాటేసింది.. త్వరగా ఇంజెక్షన్ చేయండి అంటూ ఓ యువకుడు ఆసుపత్రికి వచ్చాడు. దాదాపు 4-5 అడుగుల నాగుపామును చూసిన డాక్టర్లు, అక్కడున్న పేషేంట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొందరు అయితే భయంతో ఆసుపత్రి బయటకు పరుగులు తీశారు. డాక్టర్ చివరకు యాంటీవీనమ్ ఇంజెక్షన్‌ను యువకుడికి ఇచ్చాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం……
Uttar Pradesh: కొందరు మహిళలు చేస్తున్న నేరాలను చూస్తుంటే, ఆశ్చర్యం, అసహ్యం కలగకుండా ఉండటం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగిన ఓ మహిళ పెళ్లి చేసుకున్న భర్తనే బ్లాక్మెయిల్ చేస్తుంది. తమకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని, డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. సదరు వ్యక్తి పోలీస్ అయినప్పటికీ.. ఆమె ఎక్కడా వెనక్కి తగ్గకుండా డబ్బులను డిమాండ్ చేసింది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబి జిల్లాలోని దేర్హా గ్రామంలో దారుణం జరిగింది. అత్యాచారం కేసును విత్ డ్రా చేసుకోవడం లేదని అత్యాచార బాధితురాలిని నిందితుడు, అతని ఇద్దరు సోదరులు అత్యంత దారుణంగా నరికి చంపారు. పట్టపగటు అందరూ చూస్తుండగా ఈ దాడికి ఒడిగట్టారు. హంతకులు అశోక్, పవన్ నిషాద్ కొన్ని రోజుల మందు బెయిల్‌పై విడుదలయ్యారని పోలీసులు మంగళవారం వెల్లడించారు.