Shaheed Express: షాహిద్ ఎక్స్‌ప్రెస్‌లో కాపేపు ఫైర్ అలారం అలజడి సృష్టించింది. నిప్పూ లేదు, పొగా లేదు.. కానీ ఫైర్ అలారం మోగింది. దీంతో ఆ భోగీలో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఫైర్ అలారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాక కాసేపు బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీంతో రైల్వే సిబ్బందిని అలర్ట్ చేయడం అసలు విషయం బయటపడింది. ఇంతకి అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలోని గౌరీబజార్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న షాహిద్ ఎక్స్‌ప్రెస్‌లోని…
పోలీసుల కళ్లు గప్పి కరడుగట్టిన నేరస్తుడు పరారైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాన్పూర్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ హాలెట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేరస్తుడు పోలీసులను నుంచి బయటపడ్డాడు. ఈ క్రూరమైన నేరస్తుడు నకిలీ ఇన్స్పెక్టర్గా నటిస్తూ ప్రజల నుంచి దోపిడీలకు పాల్పడుతున్నడనే నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సిర్సాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్యాసింజర్ రైలు ఇంజిన్‌కు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అంతకుముందే.. రైలు ఇంజన్లో యువకుడి మృతదేహం ఇరుక్కోవడంతో కొన్ని కిలోమీటర్ల మేర అలానే ఈడ్చుకెళ్లింది. ఇంజిన్‌లో మృతదేహాన్ని చూసిన అక్కడి జనాలు పెద్దగా అరుపులు చేయడంతో అది గమనించిన లోకో పైలట్ రైలును ఆపాడు. దీంతో ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ రైతును పోలీసులు అన్యాయంగా కొట్టి చంపారు. ఈ ఘటనకు పాల్పడ్డ పోలీసులపై మృతుడి కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
Uttar Pradesh: గత పదేళ్లుగా దేశంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయి. కేంద్రంలోని ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢంగా వ్యవహరిస్తోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కొంత మంది మళ్లీ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేసింది.
Supreme Court: తన హత్య కేసు విచారణ జరుగుతున్న సమయంలో ‘నేను బతికే ఉన్నాను’ అంటూ ఓ పిల్లాడు కోర్టు ముందుకు రావడంతో ఒక్కసారిగా న్యాయమూర్తులతో పాటు అంతా షాక్ అయ్యారు. తన హత్య బూటకమని 11 ఏళ్ల బాలుడు ఈ రోజు సుప్రీంకోర్టు బెంచ్ ముందు హాజరయ్యాడు. బాలుడి తండ్రి, తన భార్య తరుపు కుటుంబం తన కొడుకును చంపాడని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మొదలైంది.
వివరాల్లోకి వెళితే.. షామ్లీ జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువకుడు, ఓ మహిళను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు, అయితే అందుకు సదరు మహిళ ఒప్పుకోలేదు. దీంతో జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ వెలుపల నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
అర్హులైన కుటుంబాలకు వారి కుమార్తెల పెళ్లిళ్లకు ప్రభుత్వం 'ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన' కింద రూ.51,000 ఇస్తోందని తెలిపారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే రావణుడు, కంసుడి గతి పడుతుందని, తీవ్ర పరిణామాలు చవిచూస్తారని అన్నారు.
Uttar Pradesh: ముల్లును ముళ్ళుతోనే తియ్యాలి అన్నట్లు విషానికి విరుగుడు విషమే. అందుకే పాము, తేలు వంటి విషపురుగుల విషానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అలానే పాము చర్మాన్ని బ్యాగులు, బెల్ట్‌లు మొదలనవి తారలు చేసేందుకు ఉపయోగిస్తారు. ఇక పాము విషం ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 10 గ్రాముల పాము విషం అక్షరాలా రూ/లక్షన్నర పలుకుతుంది. దీనితో కొందరు వన్య ప్రాణుల కిందకి వచ్చే పాములను పట్టుకుని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. అయితే పాములను…
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలో తండ్రిని ఎత్తుకుని నిస్సహాయుడైన కొడుకు కనిపించాడు.