ఎవరైన పాము ఎదురుపడితే భయంతో పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ కొందరు మైనర్ యువకులు దానిని పట్టుకుని ఆటలు ఆడుకుంటూ పాముకే చుక్కలు చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పాము పట్ల ఆ యువకులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. యూపీలోని బారాబంకిలో అడవికి సమీపంలో కొందరు మైనర్ యువకులు ఆడుకుంటున్నారు.
Also Read: Mitchell Marsh: వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టడంపై మిచెల్ మార్ష్ ఏమన్నాడో తెలుసా..?
అదే సమయంలో వారికి భయంకరమైన విష సర్పం (నాగుపాము) ఎదురు పడింది. దానిని చూసి భయపడకపోగా పట్టుకుని కాసేపు సరదాగా ఆటలు ఆడారు. అంతేకాదు దాని చూట్టూ చేరి పాముకే చుక్కుల చూపించారు. పాము తొక పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ ఆట వస్తువులా వ్యవహరించాడో యువకుడు. ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ షేర్ చేస్తూ యూపీ ఫారెస్ట్ అధికారులను, స్థానిక పోలీసు డిపార్టుకు ట్యాగ్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువకులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Akkineni Naga Chaitanya: దూత సిరీస్.. చై ఎట్టకేలకు హిట్ కొట్టాడు.. ?
‘వారు ఏం చేస్తున్నారో వారికైనా అర్థం అవుతుందా? పాముతో ఆటలు ఏంటీ? అది వారిని కాటేస్తే ఏంటీ పరిస్థితి. ఇప్పటి జనరేషన్ పిల్లలకు అసలు సీరియస్‌నెస్సే లేదు. ఇది జంతు హింసగా పరిగణించి యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో కాస్తా ఆటవీ శాఖ అధికారుల కంట పడటంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో బారాబంకిలో పోలీసుల స్టేషన్‌లో వారిపై కేసు నమోదైనట్టు సమాచారం.
#बाराबंकी:सांपों से खेल रहे नाबालिक बच्चे, जंगल में मिले जहरीले सांप को हाथ में लेकर प्रदर्शन दिखा रहे नाबालिक बच्चे,कभी भी हो सकता है बड़ा हादसा,मामला थाना असंद्रा के चौकी क्षेत्र सिद्धौर के समीप बिजली पावर हाउस के बगल का। @Barabankipolice @UpforestUp @112UttarPradesh pic.twitter.com/X0gy5C1eN7
— PATRAKAAR MANISH KUMAR (जनता सुरक्षा फाउंडेशन) (@MANISHKPRESS) November 28, 2023