Uttar Pradesh: యూపీలో దారుణం.. విద్యార్థిపై మూత్ర విసర్జన చేసి, దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ ప్రాంతంలో దారుణం జరిగింది. 12 తరగతి చదువుతున్న విద్యార్థిపై కొందరు యువకుల గుంపు దాడి చేసింది, అంతటితో ఆగకుండా అతనిపై మూత్రవిసర్జన చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో వైరల్‌గా మారాయి. డార్క్ గ్రే కలర్ జాకెట్ ధరించిన వ్యక్తి బాధిత యువకుడిని కొట్టి, అతనిపై మూత్ర విసర్జన చేయడం వీడియోలో కనిపిస్తోంది. మరో ఇద్దరు ఈ ఉదంతాన్ని వీడియో తీశారు. దాడి ఆపాలని విద్యార్థి ప్రాధేయపడుతున్నా కనికరించలేదు. విద్యార్థి తలపై, వీపుపై ఆ వ్యక్తి పదేపదే దాడి చేయడం కనిపిస్తుంది.
ఈ వీడియో వైరల్ కావడంతో యూపీ పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఒకర్ని అరెస్ట్ చేశారు. నిందితులను అవిశర్మ, ఆశిష్ మాలిక్, రాజన్, మోహిత్ ఠాకూర్‌లుగా గుర్తించారు. నవంబర్ 13న ఈ ఘటన జరిగింది. దాడిలో పాల్గొన్న ఆశిష్ మాలిక్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత యువకుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని పోలీస్ అధికారి పీయూష్ సింగ్ తెలిపారు.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
Read Also: PM Modi: రేపు కోటి దీపోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోడీ
నగరంలోని తన బంధువు ఇంటికి వెళ్లి వస్తుండగా తన కొడుకును కిడ్నాప్ చేశారని బాధితుడి తండ్రి చెప్పారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేశారని తెలిపారు. అతను తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా వెతకగా.. మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకుని, తనపై జరిగిన దాడి గురించి కుటుంబ సభ్యులకు చెప్పాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మొదట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడి తండ్రి ఆరోపించారు. పోలీసులు నవంబర్ 16 కేసు నమోదు చేశారని, కిడ్నాప్ సెక్షన్లను తప్పించారని కుటుంబీకులు ఆరోపించారు. దాడి చేసిన వారిలో కొందరు బాధిత విద్యార్థి స్నేహితులని, అయితే వీరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని కుటుంబీకులు చెబుతున్నారు. నిందితులపై అల్లర్లు, స్వచ్ఛందంగా గాయపరచడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపుల కింద అభియోగాలు మోపారు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం