ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (శనివారం) రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనుంది. బీజేపీకి ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఆయన సహరాన్‌పూర్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే, సాయంత్రం ఘజియాబాద్‌లో రోడ్ షో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది.
Extramarital Affair: ముగ్గురు పిల్లల తల్లి భర్తకు తెలియకుండా ఓ యువకుడితో 7 ఏళ్లుగా వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. తీరా ఈ విషయం భర్తకు తెలియడంతో విద్యుత్ స్తంభం ఎక్కి హైడ్రామాకు తెరతీసింది.
ఉత్తరప్రదేశ్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన.. ఇద్దరు పాకిస్థానీలు సహా ముగ్గురు ఉగ్రవాదులను యూపీ ఎస్టీఎస్ఎఫ్ అరెస్ట్ చేసింది. ఐఎస్ఐ(ISI) సాయంతో భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు వీరు ప్లాన్ చేశారు. STSF ప్రకారం.. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI సహాయంతో కొంతమంది పాకిస్తాన్ పౌరులు నేపాల్ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించబోతున్నట్లు కొంతకాలం నుంచి మాట్లాడుతున్నారు. వీరంతా భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారని, ఐఎస్ఐ సాయంతో హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణా శిబిరంలో శిక్షణ కూడా…
Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తా్ర్ అన్సారీ ఇటీవల జైలులో గుండెపోటుతో మరణించారు. అయితే, ఇతని మరణంపై కుటుంబ సభ్యులతో పాటు ఆయన కుమారుడు అనుమానం వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేందుకు బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 400కు పైగా సీట్లు సాధించాలని కమలం పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇస్లాంగర్ పట్టణంలోని బాణాసంచా గోదాములో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ ఇల్లు చెల్లాచెదురైంది. ప్రమాదం జరిగిన బాణసంచా గోదాము బిల్సీ రోడ్డులో ఉంది. అయితే.. ఈ ప్రమాదంలో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అందరు భావిస్తున్నారు.
PM Modi: ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు విరుచుకుపడ్డారు. అవినీతిపై పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. అవినీతికి పాల్పడిన వారి హోదాతో సంబంధం లేదకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు.