విల్లు, బాణం ఆకారంలో ‘గ్లాస్ బ్రిడ్జ్’ ఇండియాలోని ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ వంతెనను చిత్రకూట్‌లోని తులసి (షబ్రి) జలపాతం వద్ద నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. కోదండ అడవుల్లో ఉన్న జలపాతంపై రూ.3.70 కోట్లతో శ్రీరాముడి విల్లు, బాణం ఆకారంలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. అయితే.. ఈ వంతెనను లోక్‌సభ ఎన్నికల తర్వాత పర్యాటకుల కోసం ప్రారంభించనున్నారు. రానున్న కాలంలో ఇది అత్యంత అందమైన ఎకో టూరిజం కేంద్రంగా మారనుంది. మరోవైపు.. పర్యాటకుల కోసం గ్లాస్ బ్రిడ్జ్ సమీపంలో పార్క్, హెర్బల్ గార్డెన్‌తో పాటు రెస్టారెంట్లు కూడా నిర్మిస్తున్నారు.
Read Also: Pat Cummins: సన్‌రైజర్స్ కెప్టెన్కు ఓ అభిమాని ‘హారతి’.. వీడియో వైరల్
గ్లాస్ స్కై వాక్ వంతెనను అటవీ మరియు పర్యాటక శాఖ నిర్మిస్తోంది. ఘాజీపూర్‌కు చెందిన పవన్ సట్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దీని నిర్మాణం చేపట్టింది. గ్లాస్ స్కై వాక్ వంతెన నిర్మించబడిన మార్కుండి శ్రేణిలోని జలపాతాన్ని గతంలో షబ్రి జలపాతం అని పిలిచేవారు. ఈ ప్రాంతం శ్రీ రాముడి గుడితో పాటు రాజాపూర్‌లోని గోస్వామి తులసీదాస్ జన్మస్థలం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తులసి వాటర్ ఫాల్స్‌గా పేరు మార్చింది.
Read Also: AP Weather Report: ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండండి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ..!
గ్లాస్ బ్రిడ్జ్ ను విల్లు మరియు బాణం ఆకారంలో నిర్మిస్తున్నారు. బాణం పొడవు 25 మీటర్లు కాగా, రెండు స్తంభాల మధ్య విల్లు వెడల్పు 35 మీటర్లు ఉంటుందని రేంజర్ నదీమ్ మహ్మద్ తెలిపారు. వంతెన లోడ్ సామర్థ్యం చదరపు మీటరుకు 500 కిలోలు అని పేర్కొన్నారు. ఇక్కడి తులసి జలపాతంలో.. రాళ్ల నుండి మూడు నీటి ప్రవాహాలు వస్తాయి. ఇవి దాదాపు 40 అడుగుల ఎత్తులో ఉన్న విశాలమైన నీటిలో పడి అడవిలో అదృశ్యమవుతాయి. ఈ స్కై వాక్ బ్రిడ్జిపై నడుస్తూ ఉంటే.. రాళ్లపై నీరు పడుతున్న దృశ్యం, కిందకు అడవిని చూడొచ్చు.