Akhilesh Yadav: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తాన్ అన్సారీ ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని బండా జైలులో గుండెపోటుకు గురై మరణించారు. ఆయన మృతికి ‘విషప్రయోగం’ కారణమని కుటుంబ సభ్యులతో పాటు అతని కొడుకు ఆరోపించారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో మాత్రం అతను గుండెపోటుతో మరణించినట్లు నిర్థారణ అయింది. ఇదిలా ఉంటే తాజాగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆదివారం అన్సారీ ఇంటికి వెళ్లారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా మొహమ్మదాబాద్ పట్టణంలోని అన్సారీ ఇంటికి వెళ్లిన అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మార్చి 28న ముఖ్తార్ అన్సారీ మరణించారు. అన్సారీ మృతిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేసిన కొన్ని రోజుల తర్వాత అఖిలేష్ యాదవ్ అతని ఇంటికి వెళ్లడం గమనార్హం.
Also Read
Read Also: Anand Mahindra: కోతి దాడి నుండి మేనకోడలిని రక్షించిన అమ్మాయికి ఉద్యోగం ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!
దీనికి ముందు అన్సారీ కుమారుడు ఉమర్ అన్సారీ మాట్లాడుతూ.. ముఖ్తార్ అన్సారీకి మార్చి 19 భోజనంలో విషం ఇచ్చారని, అదే విషయాన్ని కోర్టుకు తెలియజేశానని చెప్పారు. అన్సారీ మరణం తర్వాత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘ ప్రతీ పరిస్థితిలో , ప్రతీ ప్రదేశంలో ఒకరి ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత, కర్తవ్యం’’ అని అన్నారు. బండా జైలులో ఒక ఖైదీ మరణించడం న్యాయ ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లేలా చేస్తుందని, ఇలాంటి సందేహాస్పద కేసులన్నింటిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారించాలని అన్నారు.
ఇదిలా ఉంటే, అఖిలేష్ యాదవ్ వచ్చి మమ్మల్ని కలవడం, మా ఆత్మగౌరవాన్ని పెంచిందని ముఖ్తాన్ అన్సారీ కొడుకు ఉమర్ అన్సారీ అన్నారు. మా నాన్నతో నాకున్న అనుబంధం వేరు, కానీ లక్షలాది మందితో మా నాన్నను మెస్సయ్యాగా చూశారని అన్నారు. అఖిలేష్ యాదవ్ రావడం తమ ఫ్యామిలీకి మాత్రమే కాదని, మా నాన్న అనుచరులకు కూడా ధైర్యాన్ని ఇచ్చిందని ఉమర్ అన్సారీ అన్నారు. ముస్లింలే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారని చెప్పారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, మేము పోరాడుతామని చెప్పారు.
#WATCH | Ghazipur, Uttar Pradesh: Mukhtar Ansari's son Umar Ansari says, "Akhilesh Yadav came and met us, he boosted our confidence. My mother and brother were not there… My relationship with my father is different, but millions of others considered my father as their messiah.… pic.twitter.com/DBjtRYBK7A
— ANI (@ANI) April 7, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు